విశాఖ స్టీలు ప్లాంట్ కు .. ఆక్సీజన్ ట్యాంకర్ల వేగన్.. (వీడియో)

By AN TeluguFirst Published Apr 22, 2021, 11:32 AM IST
Highlights

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అవసరమైన ఆక్సీజన్ సరఫరా కోసం ఓ వ్యాగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేరుకుంది. గుజరాత్ నుంచి విశాఖ స్టీలు ప్లాంట్ లోని ఆక్సీజన్ ప్లాంట్ కు గత రాత్రి  2 గంటలకు గ్యాస్ ట్యాంకర్ల వేగన్ చేరుకుంది. 

"

ఈ వేగన్లో  ఏడు గ్యాస్ ట్యాంకర్ల ఉన్నాయి. వీటిలో లిక్విడ్ ఆక్సిజన్ నింపుతారు. గ్యాస్ ట్యాంకర్లలో ఆక్సిజన్ ను   నింపటానికి 20 గంటల సమయం పడుతుంది.

దీనికొరకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రత్యేక యాడ్ తయారుచేసింది. గ్యాస్ నింపిన తర్వాత వేగన్ ద్వారా ట్యాంకర్లను గుజరాత్ కి తరలిస్తామని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గుజరాత్ లో హెల్త్ ఆక్సిజన్ ఇబ్బంది పడటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో.. ఇలా ఉపయోగపడడం.. ప్రాణవాయువుకోసం ప్లాంట్ మీద ఆధారపడడం గర్వంగా ఉందని కార్మికసంఘాలు అంటున్నాయి.

ఈ పనిని నిబద్ధతతో పూర్తి చేయడానికి శాయశక్తులు కృషి చేస్తున్నామని, దేశానికి కావాల్సిన ఆక్సీజన్ అందించడం మా బాధ్యత అంటున్నారు. 

click me!