ప్రారంభమైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ: ఏపీలో కరోనా కేసులపై చర్చ

By narsimha lode  |  First Published Apr 22, 2021, 11:14 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కరోనా కేసులు, వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై  ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేతృత్వంలో  కేబినెట్ సమిటీ గురువారం నాడు సమావేశమైంది. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కరోనా కేసులు, వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై  ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేతృత్వంలో  కేబినెట్ సమిటీ గురువారం నాడు సమావేశమైంది. ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మంత్రులు సుచరిత, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. ఏపీఐఐసీలోని 6వ,ఫ్లోర్ లో ఈ సమావేశం ప్రారంభమైంది.

రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు స్థితిగతులపై  కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది.  కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై కూడ చర్చించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై  మంత్రివర్గ ఉప సంఘం చర్చించనుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే రాష్ట్రంలో డిమాండ్ మేరకు వ్యాక్సిన్ సరఫరా లేదు.  రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్ డోసులను  పంపాలని  కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొంది. 

Latest Videos

click me!