ఏపీలో కరోనా మృత్యుఘోష...గరివిడి తహసీల్దార్ మృతి

By Arun Kumar PFirst Published Jul 29, 2020, 1:08 PM IST
Highlights

విజయనగరం జిల్లాలో కరోనా మహమ్మారి బారినపడి ఓ తహసిల్దార్ మృత్యువాతపడ్డారు. 

విజయనగరం జిల్లాలో కరోనా మహమ్మారి బారినపడి ఓ తహసిల్దార్ మృత్యువాతపడ్డారు. గరివిడి మండలం తహసీల్దార్ కె. సుభాష్ బాబు కరోనా లక్షణాలతో బాధపడుతూ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో అతడు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం అతడి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించి మృత్యువాతపడ్డారు. 

ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే ఈ జిల్లాలో 1367 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఈఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 7948 కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో  కరోనా కేసుల సంఖ్య 1,10,297కి చేరుకొన్నాయి.

జిల్లాలవారిగా చూసుకుంటే అనంతపురంలో 740, చిత్తూరులో452, గుంటూరులో 945, కడపలో650,కృష్ణాలో293, కర్నూల్ లో 1146, నెల్లూరులో 369 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 335, శ్రీకాకుళంలో 392, విశాఖపట్టణంలో 282, విజయనగరంలో 220, పశ్చిమగోదావరిలో 757 కేసులు నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

 ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 58 మంది మరణించారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. గుంటూరు జిల్లాలో 11 మంది మరణించారు. కర్నూల్ లో 10 మంది, విశాఖలో 9 మంది, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదేసి చొప్పున మరణించారు. నెల్లూరు, విజయనగరంలలో నలుగురి చొప్పున చనిపోయారు. అనంతపురంలో ముగ్గురు, కడప, శ్రీకాకుళం,పశ్చిమగోదావరిలో ఒక్కరేసి చొప్పున మరణించారు.రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1148కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,10,297 కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారిలో 52,622 మంది కోలుకొన్నారు. ఇంకా 56,527 యాక్టివ్ కేసులున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో జిల్లాల వారీగా నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -10,987, మరణాలు 89
చిత్తూరు -8261, మరణాలు  89
తూర్పు గోదావరి -16063, మరణాలు134
గుంటూరు-11,692, మరణాలు109
కడప -5743, మరణాలు 33
కృష్ణా -6000, మరణాలు153
కర్నూల్ -13,380, మరణాలు 174
నెల్లూరు -5145, మరణాలు 32
ప్రకాశం -4201, మరణాలు 49
శ్రీకాకుళం -5086, మరణాలు 63
విశాఖపట్టణం -7718, మరణాలు 90
విజయనగరం -3549, మరణాలు 44
పశ్చిమగోదావరి -9577, మరణాలు 89

click me!