జీజీహెచ్ నుండి కరోనా రోగి అదృశ్యం: హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్

By narsimha lode  |  First Published Jul 29, 2020, 1:01 PM IST

గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి నుండి కరోనా రోగి అదృశ్యమైన ఘటనపై  బుధవారం నాడు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను బుధవారం నాడు దాఖలైంది. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.



గుంటూరు: గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి నుండి కరోనా రోగి అదృశ్యమైన ఘటనపై  బుధవారం నాడు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను బుధవారం నాడు దాఖలైంది. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

ఈ నెల 14వ తేదీన కరోనా లక్షణాలు ఉన్న ఓ వ్యక్తి  తెనాలి ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అయితే తెనాలి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు లేని కారణంగా ఈ నెల 16వ తేదీన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆయనను తరలించారు. 

Latest Videos

undefined

అయితే అక్కడి నుండి ఆయన కన్పించకుండా పోయాడు. 12 రోజులుగా తన భర్త కన్పించడం లేదని భార్య ఆసుపత్రి చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోయింది. తన భర్త ఆచూకీని తెలపాలంటూ భార్య వెంకాయమ్మ కనపడిన వారిని ఆరా తీసింది. అయినా కూడ ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కూడ సరైన సమాధానం చెప్పలేదని ఆమె ఆరోపించింది.

దీంతో ఆమె తన భర్త ఆచూకీని తెలపాలని కోరుతూ ఇవాళ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
 

click me!