
విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్టుకు వారెంట్ జారీ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన ఆయనను అరెస్టు చేయాలంటూ అనకాపల్లి కోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. ఓటర్లను ఆకర్షించడాని అడ్డదారులు తొక్కారని కోర్టులో గతంలో గంటాపై కేసు నమోదైంది, పలు మార్లు కోర్టుకు హాజరవ్వాలని పిలుపునిచ్చిన ఆయన హాజరవ్వలేదు. దీనితో గంటా అరెస్ట్ చెయ్యాలంటు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో అక్రమ మార్గంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు గంటా శ్రీనివాసరావు పెద్ద ఎత్తున క్రికెట్ కిట్లు పంపిణీ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.