ఎవరినీ బెదిరించలేదు, సమగ్ర దర్యాప్తు చేయండి: ఎస్పీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ

By narsimha lodeFirst Published May 16, 2022, 8:58 PM IST
Highlights

తాను,తన అనుచరులు బెదిరించినట్టుగా సాగుతున్న ప్రచారంపై విచారణ జరిపించాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ   మచిలీపట్టణం జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ కి లేఖ రాశారు.

విజయవాడ: Gannavaram నియోజకవర్గంలో తనపై దుష్ప్రచారం చేస్తున్న సంఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ   మచిలీపట్టణం జిల్లా ఎస్పీ Siddharth kaushal కి లేఖ రాశారు.

తాను బెదిరించినట్టుగా ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయమై అనుమానాలు వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తనపై ఫిర్యాదు చేయటం లో కుట్రకోణం దాగిఉందని  Vallabhaneni Vamsi అనుమానం  అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఎస్పీని కోరాడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రామిశెట్టి నాగ వెంకటసాయి ఉమా మహేశ్వరరావు అలియాస్ బాలు అనే యువకుడు  హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో తనతో పాటు తన అనుచరులతో ప్రాణహని ఉందని  ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆ లేఖలో వంశీ ప్రస్తావించారు.ముగ్గురు వ్యక్తులు బెదిరించినట్టుగా  ఆ లేఖలో  వంశీ పేర్కొన్నారు. ఇది పూర్తిగా వాస్తవ విరుద్దమన్నారు.

also read:‘గుడివాడలో క్యాసినో జరగలేదు.. నా స్నేహితులే వాటిని నిర్వహించారు..’ వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు

గతంలో కూడా  వల్లభనేని వంశీ బెదరించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన తర్వాత ఎన్నికల పలితాలు రాకముందు ఆయనపై వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఇంటికి వెళ్లి వల్లభనేని వంశీ బెదిరించాడని అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఆ విసయమై వల్లభనేని వంశీ ఖండించారు. తనపై యార్లగడ్డ వెంకట్రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన మండిపడ్డారు.  ఆ తర్వాత చోటు చేసకున్న పరిణామాల్లో వల్లభనేని వంశీ టీడీపీకి దూరమయ్యారు. వైసీపీలో చేరారు

click me!