కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పిలుపు వచ్చింది. ఈ పిలుపు మేరకు కిరణ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీకి వెళ్లారు.
ఉమ్మడి Andhra Pradesh రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి Nallari Kiran Kumar Reddyకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ఈ పిలుపు మేరకు కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు New Delhi కి వెళ్లారు. ఏపీ రాష్ట్ర Congress పార్టీ బాధ్యతలు చేపట్టాలని కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోరుతుంది.ఈ నెల 17న డిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కిరణ్ కుమార్ రెడ్డి కలిసే అవకాశం ుందని సమాచారం. మూడు రోజుల పాటు కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉంటారు.
2018 జూన్ మాసంలో ఏపీ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు తిరిగి పార్టీలోకి రప్పించేందుకుగాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ మేరకు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ ఉమెన్ చాందీ ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆదేశించారు. పార్టీ రాస్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రానికి చెందిన నేతలకు సూచించారు.
మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో చర్చలు జరిపే బాధ్యతను మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజుకు అప్పగించారు. 2014 ఎన్నికల తర్వాత క్రియాశీలక రాజకీయాలకు మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి దూరంగా ఉన్నారు.
అయితే 2014 తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో BJP లో చేరుతారనే ప్రచారం కూడ కొంతకాలం సాగింది. అయితే ఆయన ఏ పార్టీలో కూడ చేరలేదు. ఇటీవలనే కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి సంతోష్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరారు. చిత్తూరు జిల్లాలో టిడిపిని బలోపేతం చేసేందుకు గాను Santosh kumar Reddy రెడ్డిని టిడిపిలోకి తీసుకొన్నారు.చిత్తూరులో YCP ని ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు సంతోష్ కుమార్ రెడ్డిని వ్యూహాత్మకంగా టిడిపి తమ పార్టీలోకి చేర్చుకొంది.
క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారని కూడా ప్రచారం సాగింది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలోకి కిరణ్ కుమార్ రెడ్డిని రప్పించేందుకు పార్టీ నాయకత్వం అప్పట్లో చర్యలు తీసుకొంది.
అయితే కాంగ్రెస్ పార్టీలోనే కిరణ్ కుమార్ రెడ్డి చేరేందుకు ఒకింత మొగ్గుచూపినట్టు సమాచారం. తమ స్వగ్రామానికి చెందిన తన సన్నిహితులు, మిత్రులు, అనుచరులతో కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయమై చర్చించారని ప్రచారం సాగింది.
also read:చేతులెత్తేసిన రఘువీరా: ఎపీ కాంగ్రెసు చీఫ్ గా నల్లారి?
అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కిరణ్‌కుమార్ రెడ్డికి పీసీసీ చీఫ్ లాంటి పదవిని అప్పగించే అవకాశం ఉందని ప్రచారం కూడ లేకపోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కూడ ఆయనకు సూచించారని కిరణ్ సన్నిహితుల్లో అప్పట్లో ప్రచారంలో ఉంది.అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి చేరలేదు.
ఆ తర్వాత 2019 నవంబర్ 21న కూడా కిరణ్ కుమార్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై కూడా స్పష్టత ఇచ్చారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారంపై కూడా ఆయన స్పందించారు.
తనకు PCC చీఫ్ పదవిపై అంతగా ఆసక్తి లేదని తేల్చి చెప్పేశారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఎందో భాదేస్తుందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానని గుర్తు చేశారు.
ఈ పరిణామాలు చూసి తనకు రాజకీయాలపట్ల అసంతృప్తి కలిగిందన్నారు. ఇకపోతే ఏపీ పీసీసీ చీఫ్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఒట్టిదేనని కూడా ఆయన తేల్చి చెప్పారు.