గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. చంద్రబాబుతో పాటు లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలపై వంశీ నుండి వివరణ కోరనున్నారు.
గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. చంద్రబాబుతో పాటు లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలపై వంశీ నుండి వివరణ కోరనున్నారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం సాయంత్రం టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో వంశీ చేసిన వ్యాఖ్యలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ సీనియర్ల అభిప్రాయాలను చంద్రబాబునాయుడు తెలుసుకొన్నారు.
read more హీటెక్కిన ఏపీ రాజకీయం: ఎమ్మెల్యే వంశీపై టీడీపీ నేతలు ఫిర్యాదు
వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై ఈ సమావేశంలో సీరియస్‌గా చర్చ జరిగింది. వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు పార్టీ నుండి వల్లభనేని వంశీని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆ పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు శుక్రవారం నాడు మధ్యాహ్నం చంద్రబాబునాయుడుతో సమావేశం ముగిసిన తర్వాత ప్రకటించారు.
read more టీడీపీ ఎమ్మెల్సీపై వల్లభనేని వంశీ తిట్లదండకం...అది కూడా లైవ్ లో
వల్లభనేని వంశీని సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనను వివరణ కూడ కోరాలని పార్టీ నిర్ణయం తీసుకొంది.ఈ విషయమై పార్టీ నేతలు వంశీని వివరణ కోరనున్నారు.
వల్లభనేని వంశీ త్వరలోనే వైసీపీలో చేరనున్నారు. వంశీ కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీలో వల్లభనేని వంశీ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో కన్పించడం లేదని ఆయన ప్రవ్నించారు.
2006లో వల్లభనేని వంశీ రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ ద్వారా వల్లభనేని రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని విజయవాడ ఎంపీ స్థానం నుండి వల్లభనేని వంశీ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో గన్నవరం నుండి పోటీ చేసి తోలిసారిగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో కూడ ఆయన ఇదే స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు.
Also read:జూ.ఎన్టీఆర్‌పై వంశీ వ్యాఖ్యలు: మళ్లీ ముందుకొచ్చిన నారా, నందమూరి మధ్య తేడాలు
ప్రస్తుతం వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. వల్లభనేని వంశీ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు. జూనియర్ ఎన్టీఆర్ తీసిన సినిమాలకు వల్లభనేని వంశీ నిర్మాతగా వ్యవహరించాడు.
వల్లభనేని వంశీ పార్టీ చేసిన సేవల గురించి పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు చర్చించినట్టుగా సమాచారం. అయితే పార్టీని వీడి వెళ్లే సమయంలో పార్టీ నాయకత్వంపై బురదచల్లడం పరిపాటిగా మారిందనే అభిప్రాయాన్ని కొందరు నేతలు ఈ సందర్భంగా వ్యక్తం చేసినట్టుగా సమాచారం.
read more జూ.ఎన్టీఆర్‌పై వంశీ వ్యాఖ్యలు: మళ్లీ ముందుకొచ్చిన నారా, నందమూరి మధ్య తేడాలు
మరోవైపు వల్లభనేని వంశీ సంధించిన ప్రశ్నలకు కూడ సమాధానం చెప్పాలని కూడ టీడీపీ నాయకత్వం అభిప్రాయపడింది. ఈ విషయమై టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వంశీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు. అయితే వంశీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విషయమై పార్టీ నేతలు ఎవరు స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.