
విజయవాడ: తనకు ఏపీ సీఎం YS Jagan మాటే శిరోధార్యమని గన్నవరం ఎమ్మెల్యే Vallabhaneni Vamsi చెప్పారు. తనతో కలిసి పనిచేయలేనని Dutta Ramachandra Rao చెప్పడం దేనికి సంకేతమో ఆలోచించుకోవాలని ఆయన వైసీపీ శ్రేణులను కోరారు.
శనివారం నాడు బాపులపాడు మండలం దంటగుంట్ల, రంగన్నగూడం గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. ఎవరిపైనో పెత్తనం చేయడానికి తాను వైసీపీలో చేరలేదని వంశీ చెప్పారు. అభివృద్ది కార్యక్రమాల కోసమే తాను వైసీపీలో చేరినట్టుగా వంశీ తెలిపారు.ఇండి పెండెంట్ గా బరిలోకి దిగిన ఎమ్మెల్యే Gadde Rammohan భార్య ఉంగుటూరు లో ఏకగ్రీవం సాధ్యం కాలేదన్నారు. కానీ దుట్టా రామచంద్రరావు సతీమణి జడ్పీటీసీగా గెలుపొందారో అందరికీ తెలుసునన్నారు., తాను టీడీపీలో ఉన్న సమయంలో కూడా YCP వారిని వేధించలేదన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత గొడవలు, గ్రామ రాజకీయాల నేపథ్యంలో ఘర్షణలు పెట్టుకుంటే దానికి తాను ఎలా బాధ్యుడినని ఆయన ప్రశ్నించారు. మట్టి అమ్ముకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు.
also read:వల్లభనేని వంశీతో పనిచేయలేం: సజ్జలకు తేల్చి చెప్పిన దుట్టా వర్గం
Gannavaram ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి దుట్టా రామచంద్రారావు వర్గానికి మధ్య అగాధం పెరిగింది.ఈ విషయమై దుట్టా రామచంద్రరావు వర్గాన్ని సీఎంఓ పిలిపించింది. గత వారంలో సీఎంఓ సెక్రటరీ ధనుంజయ్ రెడ్డి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు దుట్టా రామచంద్రరావు, వల్లభనేని వంశీ మోహన్ లతో మాట్లాడారు. దుట్టా రామచంద్రరావు వంశీతో కలిసి పనిచేయలేమని తేల్చి చెప్పారు. ఈ నెల 23న మరోసారి వంశీతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించే అవకాశం ఉంది.
గన్నవరం నియోజకవర్గంలో అక్రమంగా క్వారీల నిర్వహణ, మట్టి అమ్మకాలు చేయిస్తున్నారని వంశీపై తయారు చేసిన నివేదికను దుట్టా రామచంద్రరావు సీఎంఓ అధికారులకు అందించారని సమాచారం. వంశీతో కలిసి పనిచేయలేమని కూడా స్పష్టం చేశారని తెలిసింది. వంశీ వివరణ తీసుకున్న తర్వాత మళ్లీ మాట్లాడుతామని దుట్టా రామచంద్రరావు కు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని సమాచారం. వీరిద్దరితో భేటీ ముగిసిన తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. అయితే ఎమ్మెల్యే వంశీతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సజ్జల రామకృష్ణారెడ్డికి మరో కార్యక్రమం ఉన్నందున సోమవారం నాడు కలవాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఈ సమావేశం ముగిసిన తర్వాత దుట్టా రామచంద్రారావు మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీతో కలిసి పనిచేయబోమని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబానికి సాయం చేయడమే తనకు తెలుసునని చెప్పారు. అవమానాలు భరించి మరొకరి వెంట తిరగాల్సిన అవసరం తమకు లేదన్నారు. వైసీపీ కేడర్ ను వంశీ తొక్కేస్తున్నాడని కూడా దుట్టా రామచంద్రరావు ఆరోపించారు. ఈ కారణంగానే తాను రాజకీయాల్లో యాక్టివ్ గా లేనని కూడా దుట్టా రామచంద్రారావు చెప్పారు.
2019 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నుండి TDPఅభ్యర్ధిగా వల్లభనేని వంశీ పోటీ చేసి విజయం సాధించాడు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే ఆ సమయం నుండి దుట్టా రామచంద్రరావు వర్గానికి వంశీ వర్గానికి మధ్య గ్యాప్ ఉంది.