పెట్రోల్ ధరలు.. కేంద్రాన్ని నిలదీసే దమ్ములేదు, అందుకే జగన్‌పై ఇలా : చంద్రబాబుపై వల్లభనేని వంశీ ఆగ్రహం

Siva Kodati |  
Published : Nov 10, 2021, 03:42 PM IST
పెట్రోల్ ధరలు..  కేంద్రాన్ని నిలదీసే దమ్ములేదు, అందుకే జగన్‌పై ఇలా : చంద్రబాబుపై వల్లభనేని వంశీ ఆగ్రహం

సారాంశం

టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మండిపడ్డారు గన్నవరం ఎమ్మెల్యే (gannavaram mla) వల్లభనేని వంశీ (vallabhaneni vamsi mohan) .కేంద్ర ప్రభుత్వమే పెట్రోలో, డీజిల్ ధరలను (petrol diesel price) పెంచిందని వంశీ చెప్పారు. సెస్ పేరుతో రూ.కోట్లను వసూలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదని వంశీ మండిపడ్డారు. 

టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మండిపడ్డారు గన్నవరం ఎమ్మెల్యే (gannavaram mla) వల్లభనేని వంశీ (vallabhaneni vamsi mohan) . బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుకు మతిభ్రమించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే పెట్రోలో, డీజిల్ ధరలను (petrol diesel price) పెంచిందని వంశీ చెప్పారు. సెస్ పేరుతో రూ.కోట్లను వసూలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదని వంశీ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలు చేయాలంటూ చంద్రబాబు  కొత్త నాటకానికి తెరలేపుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు విష ప్రచారాలను నమ్మేందుకు జనం సిద్ధంగా లేరని వంశీ స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇంధన ధరలపై వ్యాట్‌ను పూర్తిగా రద్దు చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు(ఒక గంటపాటు) రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌లలో నిరసనలు చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. 

Also Read:రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన.. పిలుపు ఇచ్చిన చంద్రబాబు

అంతుకుముందు చంద్రబాబు పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) ఇచ్చిన హామీలను ఆ తర్వాత విస్మరించారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. కానీ, అటు తర్వాత ఈ హామీని పట్టించుకోలేదు అని విమర్శించారు. హామీ ప్రకారం, పెట్రోల్‌పై రూ. 16, డీజిల్‌ పై రూ. 17 తగ్గించాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో చమురు ధరలను తగ్గించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అటువైపుగా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇంధన ధరలు తగ్గించడంలో రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండి చేయి చూపిందని చెప్పారు. జగన్ రెడ్డి అవినీతి, దుబారా, చేతకాని పరిపాలనా విధానాలతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని ఆరోపణలు చేశారు. 

కాగా.. దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్  ధరలు చుక్కలనంటాయి. క్రమంగా పెరుగుతూ సెంచరీని దాటాయి. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. డీజిల్ ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీకి చమురు ధరల పెరుగుదల తీవ్ర సమస్యగా పరిణమించింది. ఈ నేపథ్యంలోనే దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వెల్లడించగానే కనీసం పది బీజేపీ పాలిత రాష్ట్రాలూ అదే దారిలో వెళ్లాయి. కేంద్ర ప్రభుత్వ తగ్గింపునకు అదనంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా, నిన్ననే పంజాబ్ ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తూ చమురు ధరలను తగ్గించింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలు, అక్కడ తుపాను బీభత్సం
CM Chandrababu Naidu Attends Swachha Andhra Swarna Andhra Program in Nagari | Asianet News Telugu