నేను విశ్వాస ఘాతకుడినైతే... ఆయన ఎందరికో నమ్మకద్రోహి : చంద్రబాబుకు వల్లభనేని వంశీ కౌంటర్

By Siva KodatiFirst Published Oct 24, 2021, 3:41 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కౌంటరిచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాను నీ ఒక్కడికే విశ్వాస ఘాతుకుడిని అని ఆయన అన్నారు. ఎంతోమంది మహానుభావులకు చంద్రబాబు నమ్మకద్రోహి అంటూ దుయ్యబట్టారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కౌంటరిచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాను నీ ఒక్కడికే విశ్వాస ఘాతుకుడిని అని ఆయన అన్నారు. ఎంతోమంది మహానుభావులకు చంద్రబాబు నమ్మకద్రోహి అంటూ దుయ్యబట్టారు. వెన్నుపోటు, నమ్మకద్రోహులకు చంద్రబాబు పేటెంట్ దారుడంటూ వంశీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్‌కు పొర్లు దండాలు పెట్టానన్న చంద్రబాబు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు తేలేవరకు అంతేగా అంటూ వంశీ సెటైర్లు వేశారు. 

కాగా.. మాజీ మంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ శనివారం తీవ్రంగా ప్రతిస్పందించారు. Paritala Sunitha వ్యాఖ్యలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ము, మొగతనం ఉంటే వచ్చి నారా లోకేష్ ను గన్నవరంలో పోటీ చేయాల్సిందిగా చెప్పాలని ఆయన సవాల్ చేశారు. సాధారణ ఎన్నికల దాకా ఆగడం ఎందుకు, ఇప్పుడే తాను రాజీనామా చేస్తానని, తన వదిన పరిటాల సునీత వచ్చి గన్నవరంలో లోకేష్ నో, చంద్రబాబునో పోటీకి దించి గెలిపించుకునే ప్రయత్నం చేయాలని Vallabhaneni Vamsi అన్నారు.

ALso Read:మొగతనం ఉంటే లోకేష్ ను పోటీ చేయమనండి: పరిటాల సునీతకు వల్లభనేని వంశీ కౌంటర్

పరిటాల సునీతను తాను వదినగానే భావిస్తానని ఆయన చెప్పారు. పరిటాల సునీతకు ఇప్పుడే ఎందుకు అంత కోపం వచ్చిందో తెలియదని ఆయన అన్నారు. ఆమె కృష్ణ సారథ్యం వహిస్తారో, శల్య సారథ్యం చేస్తారో చూద్దామని ఆయన అన్నారు. తన ఖాళీ లెటర్ హెడ్ మీద సంతకం చేసిన ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎన్టీవీ ప్రతినిధికి ఇచ్చారు. దానిపై రాజీనామా చేస్తున్నట్లు రాసి పరిటాల సునీత స్పీకర్ కు ఇవ్వాలని చెప్పారు. దమ్ముంటే Chandrababu, Nara Lokesh వచ్చి గన్నవరంలో పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు. 2019లో మంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రి కొడాలి నానిని ఓడించలేకపోయారని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును పరిటాల సునీత చదివి వినిపించినట్లున్నారని ఆయన వ్యాఖ్యానించారు.   

చంద్రబాబు సాయంత్రం పడుకుంటే పొద్దున ఉన్నాడా, లేదా అని చేయి పట్టుకుని చూడాల్సిన వయస్సులో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తల్లికీ గర్భస్థ శిశువుకు మధ్య గొడవ పెట్టగలిగే సమర్థుడు చంద్రబాబు అని ఆయన అన్నారు. గన్నవరానికో, గుడివాడకో తానూ కొడాలి నాని మొదటివాళ్లమూ కాదు, చివరి వాళ్లమూ కాదని ఆయన అన్నారు. 

 
 

click me!