Vallabhaneni Vamsi: వైసీపీలో ముదురుతున్న‌ అధిప‌త్య పోరు.. యార్లగడ్డకు వల్లభనేని వంశీ స్ట్రాంగ్ కౌంటర్‌

By Rajesh KFirst Published Jun 11, 2022, 2:38 PM IST
Highlights

Vallabhaneni Vamsi: గన్నవరం నియోజకవర్గంలోని వైకాపాలో  వ‌ర్గ‌పోరు రోజురోజుకు ముదురుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ తప్పకుండా తనకే వస్తుందన్న యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్‌ ఇచ్చారు. 
 

Vallabhaneni Vamsi: ఏపీ రాజ‌కీయాల్లో గన్నవరం నియోజకవర్గంలోని వైకాపాలో నెల‌కొన్న వర్గపోరు హ‌ట్ టాఫిక్ గా మారింది.  యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీల మ‌ధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది.  టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైఎస్ఆర్‌సీపీలో చేరడాన్ని యార్లగడ్డ వెంకట్రావుతో పాటు అత‌ని అనుచ‌ర వ‌ర్గం ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. వారిలో నెల‌కొన్న అసమ్మతిని బ‌హిరంగంగానే  వెళ్లగక్కుతున్నారు. యార్ల‌గ‌డ్డ‌ ముందు ఉండే.. వంశీతో కలిసి పనిచేసేది లేదని బాహాటంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో గన్నవరం అధికార వైసీపీలో వ‌ర్గ‌పోరు రోజు రోజుకీ ముదురుతోంది. 

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను టార్గెట్ చేస్తూ.. యార్లగడ్డ వెంకట్రావు విమర్శలు గుప్పించారు. దానికి  కౌంట‌ర్ గా వ‌ల్ల‌భ‌నేని ప‌లు కీల‌క‌ వ్యాఖ్య‌లు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార‌ వైసీపీ నుండి త‌న‌కు టికెట్‌ తప్పకుండా వస్తుందన్న యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్య‌లకు వల్లభనేని వంశీ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. 

గన్నవరం  ప్రజలు తనను ఆశీర్వదించారని, వాళ్లకి ఏ ఇబ్బంది వ‌చ్చిన తను ప‌రిష్క‌రిస్తాన‌ని. తనను పని చేయమని సీఎం జగన్ చెప్పారని మరోసారి  పునరుద్ఘాటించారు. ఒకవేళ ఈ విషయంలో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుకి బాధ ఉంటే సీఎంను కలవాలని అన్నారు. అంతేకానీ, ఇలాంటి మాటలు మాట్లాడం సరికాదని హితవు పలికారు. తనకు సీఎం జగన్‌ మద్దతు ఉంద‌న్నారు. దారిని వచ్చేపోయే వారి గురించి పట్టించుకోని అన్నారు.  ఎవరికి సీటు ఇవ్వాలో.. సీఎం జగన్ కు చాలా బాగా తెలుసున‌ని, ఆయ‌నే నిర్ణయిస్తారన్నారు. మట్టి తవ్వకాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దారినపోయే ప్రతివాడు త‌న‌ కామెంట్స్ చేస్తుంటారని వ్యంగ్యంగా మాట్లాడారు.  గ‌న్నవ‌రం ప్ర‌జ‌ల‌కు ఏం చేయాలో తనకు తెలుసని పేర్కొన్నారు.  పనిచేయకుండా హడావుడి చేసే వాళ్లను చాలా మందిని చూశాన‌నీ, తాను హీరోనో ?.. విలన్‌నో? గన్నవరం ప్రజలను అడిగితే చెబుతారని అన్నారు. త‌నని విలన్ అన్న వాళ్లు మహేష్ బాబు, ప్రభాస్‌లా? అని  ఎద్దేవా చేశారు. అన‌వ‌స‌రంగా మట్టి గురించి రాద్దాంతం చేస్తున్నార‌నీ వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసేవాళ్లంతా చంద్రబాబు స్కూల్ చెందిన వాళ్లేన‌ని ఎమ్మెల్యే వంశీ ఎద్దేవా చేశారు. 
 
 సీఎం జగన్ త‌నను ప‌ని చేయమన్నార‌నీ, ఆయ‌న ఆదేశాల అనుసారంగా చేస్తున్న‌న‌నీ, మిగతా వారి గురించి పార్టీ చూసుకుంటుందని అన్నారు.  త‌న‌ మీద ఏమైనా బాధ ఉంటే వారు జగన్‌ దగ్గర చెప్పుకోవాల‌ని అన్నారు. కానీ.. పిచ్చి కామెంట్లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. తాను గెలిచినా.. ఓడిపోయినా.. గన్నవరంలో ఉంటానని స్ప‌ష్టం చేశారు.  ఊరు, దేశం వదిలిపోయే వాళ్లు.. ఊరికే వచ్చి పారిపోయేవాళ్లను చాలా మందిని చూశామ‌ని వంశీ అన్నారు.

గ‌న్న‌వ‌రం టికెట్ నాదే:  యార్ల‌గ‌డ్డ‌

శుక్ర‌వారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో వైసీపీ నేత యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గన్నవరం టికెట్‌ తనదేనని అన్నారు. గతంలో గన్నవరం పరిధిలో ఇసుక దోపిడీ జరిగిందని.. దానిపై విచారణ చేయాల‌ని  యార్ల‌గ‌డ్డ‌ డిమాండ్‌ చేశారు. టీడీపీలోకి వెళ్తున్నాన‌ని వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌మ‌వి కొట్టిపారేశారు. తాను సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద‌ద్రబాబులను నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదనీ, గ‌న్న‌వ‌రం నియోజకవర్గంలోని ప్రతి సమస్య  త‌న‌కు తెలుసున‌నీ అన్నారు. వల్లభనేని వంశీ త‌మ పార్టీలో ఉన్నప్పటికీ.. సీఎం జగన్ త‌న‌కే టికెట్‌ ఇస్తారనే నమ్మకం త‌న‌కు ఉంద‌ని వెంకట్రావు పేర్కొన్నారు.

click me!