మచిలీపట్నం వైసీపీలో ముసలం.. రంగంలోకి దిగిన పార్టీ హైకమాండ్.. బాలశౌరికి ఫోన్..!

Published : Jun 11, 2022, 02:32 PM IST
మచిలీపట్నం వైసీపీలో ముసలం.. రంగంలోకి దిగిన పార్టీ హైకమాండ్.. బాలశౌరికి ఫోన్..!

సారాంశం

మచిలీపట్నం వైసీపీలో చెలరేగిన ముసలం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆగ‌డాల‌కు అడ్డూ అదుపు లేకుండా పోయింద‌ని వైసీపీ ఎంపీ బాల‌శౌరి ఆరోపించడం హాట్ టాపిక్‌గా మారింది. 

మచిలీపట్నం వైసీపీలో చెలరేగిన ముసలం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆగ‌డాల‌కు అడ్డూ అదుపు లేకుండా పోయింద‌ని వైసీపీ ఎంపీ బాల‌శౌరి ఆరోపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతుంది. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచిలీపట్నంలో వైసీపీ పంచాయితీపై తాజాగా ఆ పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. ప్రభుత్వ సలహాదారు బాలశౌరికి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మీడియాతో మాట్లాడవద్దని పార్టీ పెద్దలు బాలశౌరికి చెప్పినట్టుగా సమాచారం. 

అసలేం జరిగింది.. 
మచిలీపట్నం వైసీపీలో కొంతకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న వర్గ విభేదాలు. ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎంపీ వల్లభనేని బాలసౌరి పర్యటనను వైకాపాకే చెందిన నగర కార్పొరేటర్ అడ్డుకునే ప్రయత్నం చేయటం మచిలీపట్టణంలో ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ కోసం పనిచేసినా బాలశౌరి ప్రాధాన్యతివ్వడం లేదంటూ.. పేర్నినాని అనుచరుడు అజ్గర్‌ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాలశౌరి పర్యటనను అజ్గర్‌ వర్గీయులు అడ్డుకున్నారు. బాలశౌరి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం జగన్ చెప్పారనే బాలశౌరిని గెలిపించామని .. కానీ తమను ఎంపీ పట్టించుకోవడం లేదంటూ అజ్గర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే తనను అడ్డుకోవడంపై ఎంపీ బాలశౌరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేర్ని నాని తనను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఆరోపించారు. టీడీపీ నేత కొనకళ్లతో అధికార పార్టీ ఎమ్మెల్యే పనేంటీ అని ఎంపీ నిలదీశారు. వైసీపీ ఏదారి పడుతోందో ప్రజలకే అర్ధం కావడం లేదంటూ బాలశౌరి అన్నారు. రేపటి నుంచి బందరులోనే ఉంటానని.. ఎవరేం చేస్తారో చూస్తానంటూ ఎంపీ హెచ్చరించారు. తాటాకు చప్పుళ్లకు, ఊడుత ఊపుళ్లకు భయపడేది లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంను విమర్శించిన కార్యక్రమంలో పేర్ని నాని ఎందుకు పాల్గొన్నారని బాలశౌరీ ప్రశ్నించారు. సుజనా చౌదరి, పేర్ని నాని ఒకరినొకరు పొగుడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

అయితే బాలశౌరి కామెంట్స్ పేర్ని నాని స్పందించలేదు. అయితే త్వరలో మీడియా సమావేశం నిర్వహిస్తామని పేర్నినాని వర్గం చెబుతోంది. ఎంపీ చెప్పినవి అన్ని అబద్దాలు అని కొట్టిపారేసింది.
 

PREV
click me!

Recommended Stories

Sandhyarani: అంగన్వాడీల 9కోర్కెలు పూర్తి చేశాం.. త్వరలో ఇది కూడా పూర్తి చేస్తాం| Asianet News Telugu
AP Food Commission Chairman Chitha Vijay Prathap Reddy on Anganwadi Centres | Asianet News Telugu