సంకల్పసిద్ది విషయంలో తప్పుడు ఆరోపణలు: టీడీపీ నేతలకు లీగల్ నోటీసులు పంపిన వల్లభనేని వంశీ

By narsimha lode  |  First Published Dec 12, 2022, 8:48 PM IST

టీడీపీ నేతలు బచ్చుల అర్జునుడు, పట్టాభిలపై  గన్నవరం ఎమ్మెల్యే  వల్లభనేని వంశీలు  పరువు నష్టం దావా వేశారు. సంకల్పసిద్ది వ్యవహరంలో  తప్పుడు ఆరోపణలు చేశారని  వంశీ ఆరోపిస్తున్నారు.
 



విజయవాడ: సంకల్పసిద్ది వ్యవహరంలో  టీడీపీ నేత బచ్చుల అర్జునుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిలకు  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరువు నష్టం దావా వేశారు.ఈ విషయమై నోటీసులను సోమవారం నాడు పంపారు. సంకల్ప సిద్ది విషయంలో తనకు సంబంధం లేకున్నా  తనపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  చెప్పారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఆయన డిమాండ్  చేశారు.లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని  వల్లభనేని వంశీ  గతంలోనే ప్రకటించారు. తనపై తప్పుడు ప్రచారం చేసినందుకు గాను బచ్చుల అర్జునుడు, పట్టాభిలకు వల్లభనేని వంశీ ఇవాళ నోటీసులు పంపారు.

సంకల్పసిద్ది కేసు విషయంలో  తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కూడా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ నెల 1వ తేదీన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కేసు విచారణను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కూడా ఆయన కోరారు.  సంకల్పసిద్దితో  తనకు ఎలాంటి సంబంధం లేదని వంశీ స్పష్టం చేశారు.ఈ కేసులో రాజకీయ నేతలకు ఎలాంటి సంబంధం లేదని  విజయవాడ సీపీ  ప్రకటించిన విషయాన్ని వల్లభనేని వంశీ గుర్తు చేస్తున్నారు.

Latest Videos

undefined

also read:సంకల్పసిద్దిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి: డీజీపీకి వల్లభనేని వంశీ వినతి

సంకల్ప సిద్ది విషయంలో ప్రజల నుండి రూ. 11 వేల కోట్లు వసూలు చేశారని  టీడీపీ నేతలు ఆరోపణలు చేశారని వంశీ చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా  ఆరోపణలు చేయడాన్ని వంశీ తప్పుబట్టారు. తనపై చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని  వంశీ టీడీపీ నేతలను కోరారు.ఈ విషయమై  తాను  లీగల్ నోటీసులు పంపుతానని వంశీ ఈ నెల 1వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే.సంకల్పసిద్ది సంస్థను ఏర్పాటు చేసి ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి నిర్వాహకులు మోసం చేశారు.ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!