పోలవరం నిర్మాణం మరింత ఆలస్యం అయ్యే అవకాశం.. పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్రం..

Published : Dec 12, 2022, 05:25 PM IST
పోలవరం నిర్మాణం మరింత ఆలస్యం అయ్యే అవకాశం.. పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్రం..

సారాంశం

పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న గడువులోగా పోలవడం పూర్తికవాడం కష్టమేనని స్పష్టం చేసింది.

పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న గడువులోగా పోలవడం పూర్తికవాడం కష్టమేనని స్పష్టం చేసింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టకు సంబంధించి వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం అంచనా వేసిన టైమ్‌లైన్‌ల ప్రకారం.. పోలవరం ప్రాజెక్ట్‌ను 2024 మార్చి నాటికి, ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను 2024 జూన్ నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేయబడిందని తెలిపారు. 

అయితే 2020, 2022 లలో గోదావరిలో పెద్ద వరదల కారణంగా చోటుచేసుకున్న ఎదురుదెబ్బలతో  ప్రతిపాదిత షెడ్యూల్‌లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు చెప్పారు. ప్రాజెక్ట్ పర్యవేక్షణ, సకాలంలో అమలు కోసం భారత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)ని ఏర్పాటు చేసిందని తెలిపారు.  ప్రాజెక్ట్ సకాలంలో అమలును నిర్ధారించడానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబడిన ఏజెన్సీలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పోలవరంని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినప్పటి నుంచి..  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టుపై రూ. 15,970.53 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదించిందని చెప్పారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), సెంట్రల్ వాటర్ కమీషన్ (సీడబ్ల్యుసీ) సిఫారసుల మేరకు ఇప్పటివరకు రూ. 13,226.04 కోట్లు రీయింబర్స్ చేసినట్టుగా తెలిపారు. అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రీయింబర్స్‌మెంట్ కోసం పీపీఏకి 483 కోట్ల రూపాయల క్లెయిమ్‌ను సమర్పించిందని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్