జగన్ తో గంగుల ప్రతాపరెడ్డి భేటీ

First Published May 19, 2017, 8:37 AM IST
Highlights

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు గంగుల ప్రతాపరెడ్డి పేరు ఖరారు కాగానే నంద్యాల లో ఒక అసక్తికరమయిన పరిస్థితి ఎదురవుతుంది. తెలుగుదేశం తరఫున భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డి అభ్యర్థి అని ప్రచారం జోరుగా ఉంది. భూమా, గంగుల కుటుంబాలు రెండు ఆళ్లగడ్డ కుటుంబాలే. ఆళ్ల గడ్డ రాజకీయాలకు నంద్యాలే వేదిక కాబోతున్నది.

కాంగ్రెస్‌ మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డిని వైసిపి నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు.

 

ప్రతాపరెడ్డి నిన్న హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌  వైసిపి  కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సూచన ప్రాయంగా ప్రతాపరెడ్డి యే అభ్యర్థి అని  నిర్ణయమయినట్లు తెలిసింది. ఈ విషయాన్నితొందర్లోనే అర్భాటంగా ప్రకటిస్తారు.

 

ప్రతాపరెడ్డి ఇంకా పార్టీలో సభ్యుడు కాలేదు కాబట్టి ఈ ప్రకటన వాయిదావేసినట్లు చెబుతున్నారు. ఒక ముహూర్తం ఖరారు చేసుకుని ప్రతాపరెడ్డి పార్టీలో చేరతారు,  ఆ తర్వాత ప్రకటన లాంఛన ప్రాయమేనని వైసిపి నేత ఒకరు తెలిపారు.

 

ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్నా, చురుకుగా లేరు.

 

ఈ మధ్యనే ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి వైసిపిలో చేరారు. ఎమ్మెల్యే కోటాలో నుంచి ఎమ్మెల్సీ  కూడా అయ్యారు.

 

ప్రతాపరెడ్డి పేరు ఖరారు కాగానే నంద్యాల లో ఒక అసక్తికరమయిన పరిస్థితి ఎదురవుతుంది. తెలుగుదేశం తరఫున భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డి అభ్యర్థి అని ప్రచారం జోరుగా ఉంది. భూమా గంగుల కుటుంబాలు రెండు ఆళ్లగడ్డ కుటుంబాలే. ఆళ్ల గడ్డ రాజకీయాలకు నంద్యాలే వేదిక కాబోతున్నది.

 

click me!