వివాహేతర సంబంధం: కూతురికి ఉరేసి ఆత్మహత్య చేసుకొన్న తండ్రి

Published : Sep 04, 2020, 06:03 PM IST
వివాహేతర సంబంధం: కూతురికి ఉరేసి ఆత్మహత్య చేసుకొన్న తండ్రి

సారాంశం

తన కూతురికి ఉరివేసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ తండ్రి. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను  పంచుకొన్నాడు. తన భార్య కారణంగానే కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.

చిత్తూరు: తన కూతురికి ఉరివేసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ తండ్రి. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను  పంచుకొన్నాడు. తన భార్య కారణంగానే కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.

డెలీవరీ బోయ్ గా గణేష్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆయనకు పెళ్లై భార్య కూడ ఉంది. తన భార్యకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆయన కుటుంబసభ్యులతో చెప్పేవాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి.

పెద్ద మనుషుల మధ్య ఈ విషయమై పంచాయితీలు కూడ జరిగాయి. ఈ వ్యవహారంపై కొన్నాళ్లు భార్యాభర్తల మధ్య గొడవలు సద్దుమణిగాయి.

also read:హైద్రాబాద్ లో దారుణం:32 ఏళ్ల మహిళపై 19 ఏళ్ల యువకుడి అత్యాచారం

ఆ తర్వాత తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చినట్టుగా గణేష్ తన కుటుంబసభ్యుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. దీంతో తన భార్య నుండి గణేష్ విడాకులు తీసుకొన్నాడు.

అయితే తన ఐదేళ్ల కూతురిని భార్య వద్దే ఉంది. అయితే ఈ విషయమై గణేష్ కోర్టును ఆశ్రయించాడు. అయితే తన కూతురిని తన భార్య చిత్రహింసలు పెట్టేదని గణేష్ ఆరోపించాడు. ఆమె ప్రియుడు కూడ తన కూతురిని ఇబ్బంది పెట్టేవాడన్నారు.తన కూతురి కోసం కోర్టు మెట్లెక్కినా కూడ తనకు న్యాయం జరగలేదన్నారు. తన బాధనంతా సెల్పీ వీడియోలో తెలిపాడు.

ఆ తర్వాత బాత్ రూమ్ లో కూతురికి ఉరివేశాడు. ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన తెలిసిన తర్వాత పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై గణేష్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?