హైదరాబాద్:హైద్రాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకొంది. పెళ్లి కాని 32 ఏళ్ల మహిళపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హైద్రాబాద్ పాతబస్తీలోని ఎర్రకుంటలో ఉండే 19 ఏళ్ల యువకుడు తాను నివాసం ఉండే సమీప ప్రాంతానికి చెందిన పెళ్లికాని 32 ఏళ్ల యువతిని ఏడాదిగా ప్రేమిస్తున్నట్టుగా నమ్మించాడు.

ప్రేమ పేరుతో వారిద్దరూ మరింత మధ్య సన్నిహితంగా మారారు. ఆ మహిళపై ఆ యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవడానికి యువకుడు నిరాకరించారు. 

పెళ్లి చేసుకొంటానని చెబితేనే ఆ యువకుడితో తాను చనువుగా ఉన్నట్టుగా ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.  పెళ్లి చేసుకోవాలని తాను కోరితే  యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  నిందితుడైన ఆ యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మహిళలపై అత్యాచారాలు, దాడుల ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ తరహా ఘటనలను అడ్డుకొనేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకొంటున్నప్పటికీ ఆశించిన మేరకు ప్రయోజనాలు ఇవ్వడం లేదని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.