ఏపీ జైళ్లలో ఖైదీలకు తక్కువ వేతనాలు: హైకోర్టులో విచారణ

By Siva KodatiFirst Published Sep 4, 2020, 5:07 PM IST
Highlights

జైళ్లలో ఖైదీల ఈక్వటబుల్ వేజేస్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ లో చాలా తక్కువ ఈక్వటబుల్ వేజేస్ ఖైదీలకు ఇస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

జైళ్లలో ఖైదీల ఈక్వటబుల్ వేజేస్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ లో చాలా తక్కువ ఈక్వటబుల్ వేజేస్ ఖైదీలకు ఇస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఖైదీలకు  జైలులో 7 గంటల పాటు పనిచేసినదుకు అన్ స్కిల్డ్ 30రూ,సెమి స్కిల్డ్ 50,స్కిల్డ్ 70రూపాయలు ఇస్తున్నారని పిటిషనర్ వెల్లడించారు. ఇలా ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దమని తన పిటిషన్‌లో ప్రస్తావించారు.

అయితే గతంలో ప్రభుత్వం జీవో ఆర్టీ నంబర్ 197 ప్రకారం ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్న ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఖైదీల ఈక్వటబుల్ వేజెస్ ను  ప్రభుత్వం సవరించిందని, దీనిపై ప్రభుత్వం పది రోజుల్లో జీవో ఇవ్వనుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అలాగే కౌంటర్ దాఖలు చేయడానికి 10 రోజులు సమయం కావాలని ఆయన కోరారు. ఇరు పక్షాల వాదనలను విన్న ధర్మాసనం తదుపరి విచారణ రెండు వారాలపాటు వాయిదా వేసింది.

click me!