ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా నుంచి తన ప్లాంట్ ను తమిళనాడుకు తరలించడానికి కియా మోటార్స్ ప్రయత్నాలు చేస్తుందనే వార్తాకథనంపై టీడీపి ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి కియా మోటార్స్ ప్లాంట్ తమిళనాడుకు తరలిపోతుందనే వార్తాకథనంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ స్పందించారు. ఈ వార్తాకథనంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Also Read: పరమ చెత్త ఊహాగానాలు: ప్లాంట్ తరలింపు వార్తలపై కియా మోటార్స్
undefined
కియా మోటార్స్ ప్లాంట్ ను తమిళనాడుకు తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాయిటర్స్ ఓ వార్తాకథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ కథనం అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు ఆగడం లేదు.
Also Read: ఏపి నుంచి కియా మోటార్స్ ఔట్: సంచలనం సృష్టించిన వార్తాకథనం
పరిశ్రమను స్థాపించిన కొన్ని నెలలకే తమకు ఎదురవుతున్న సవాళ్లను, సమస్యలను దృష్టిలో ఉంచుకుని 1.1 బిలియన్ డాలర్ల ప్లాంట్ ను తరలించాలని కియా నిర్ణయించుకుందని గల్లా జయదేవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు పెట్టుబడులకు ఇది ప్రతికూలంగా మారుతుందని ఆయన అన్నారు. రాబోయే తరాల ఉపాధి అవకాశాలను అది దెబ్బ తీస్తుందని ఆయన అన్నారు.
Imagine the issues & challenges that Motors had to face, if they are deciding to move their $1.1 Bn plant within few months of inaugurating it. This will have a impact on the & in the State.https://t.co/RPLCTE58qY
— Jay Galla (@JayGalla)