నెల్లూరులో విద్యార్ధినిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారయత్నం: వ్యాన్ దగ్ధం

Published : Feb 06, 2020, 11:57 AM IST
నెల్లూరులో విద్యార్ధినిపై  వ్యాన్ డ్రైవర్ అత్యాచారయత్నం: వ్యాన్ దగ్ధం

సారాంశం

నెల్లూరులో స్కూల్ వ్యాన్ డ్రైవర్ శివ 8వ తరగతి విద్యార్ధినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 

నెల్లూరు: నెల్లూరు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో  8వ తరగతి విద్యార్ధినిపై వ్యాన్‌ డ్రైవర్ శివ  అత్యాచారయత్నానికి గురువారం నాడు ప్రయత్నించాడు. శివ‌ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. 

నెల్లూరు పట్టణంలోని ప్రైవేట్‌ స్కూల్లో విద్యను అభ్యసించే  ఓ విద్యార్థిని  ప్రతిరోజూ మాదిరిగానే గురువారం నాడు స్కూల్ వ్యాన్‌లో స్కూల్‌కు బయలు దేరింది.

అయితే స్కూల్‌ వ్యాన్‌లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన వ్యాన్ డ్రైవర్ శివ వ్యాన్‌లో ఉన్న 8వ తరగతి విద్యార్ధినిపై  వ్యాన్‌లోనే అత్యాచారయత్నానికి ప్రయత్నంచాడు.  దీంతో ఆ బాలిక  కేకలు వేసింది. బాలిక కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొన్నారు.  వ్యాన్ డ్రైవర్ శివను చితకబాదారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు.

గతంలో కూడ శివపై ఇదే రకమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పాఠశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని  విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ విద్యార్ధినిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారయత్నానికి ప్రయత్నించడంతో ఆగ్రహనికి  గురైన స్థానికులు స్కూల్ వ్యాన్ ను దగ్ధం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!