
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, అమరరాజా గ్రూపు సంస్థల ఛైర్మన్ గల్లారామచంద్ర నాయుడి మనవడు గల్లా అశోక్ త్వరలో వెండి తెరపై దర్శనమివ్వనున్నారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు ఇప్పటికే అశోక్ మొదలుపెట్టాడు. ఇప్పటికే కథను ఎంపిక చేసుకోవడం కూడా పూర్తయ్యింది.
AlsoRead గల్లా జయదేవ్ కుమారుడి సినిమా నాగ చైతన్య చేతుల్లోకి ?...
ఆయన సినిమాకు సంబంధించిన కథను కాణిపాక వరసిద్ధుని సమక్షంలో ఉంచి పూజలు నిర్వహించారు.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా ఘనవిజయం సాధించాలని అశోక్‌తో పాటు ఆయన కుటుంబీకులు కోరుకున్నారు.
అంతకుముందు తవణంపల్లె మండలం దిగువమాఘంలోని రాజన్న పార్కులో గల్లా అశోక్ తన ముత్తాత,పార్లమెంటు మాజీ సభ్యుడైన పాటూరు రాజగోపాల నాయుడికి కుటుంబసభ్యులతో కలసి నివాళులర్పించారు. చిత్ర కథను ఆయన పాదాల వద్ద ఉంచి సక్సెస్ కావాలని కోరుకున్నారు. అమరరాజా అధినేత గల్లా రామచంద్రనాయుడు, మాజీ మంత్రి అరుణకుమారి,అశోక్ తల్లి పద్మావతి, చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
AlsoRead అమరావతిపై చంద్రబాబు అబద్దాలు: గల్లా జయదేవ్ చెప్పిన వాస్తవమిదీ...
అయితే... గల్లా అశోక్ ఒక ప్లాప్ అందుకున్న దర్శకుడితో సినిమాకు సిద్దమైనట్లు సమాచారం. నాని - నాగార్జున లతో దేవదాస్ అనే సినిమా చేసి అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయిన శ్రీరామ్ ఆదిత్య నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టే పనిలో ఉన్నాడు.
ఈ క్రమంలో అశోక గల్లా స్క్రిప్ట్ ను నచ్చి అతనితో వర్క్ చేయడానికి ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జులైలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేయాలనీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.