స్నేహం కోసం ప్రాణం వదలి... ఆఖరి చూపుకోసమైనా రండి అంటూ లేఖ..

By telugu teamFirst Published Nov 7, 2019, 9:43 AM IST
Highlights

తాను ఎంతో స్నేహంగా ఉండే తన మిత్రుడు హేమంత్ తనను దూరం పెట్టడంతో వేణు గోపాల్ తట్టుకోలేకపోయాడు. పైగా కొత్తగా పరిచయం అయిన అమ్మాయిల విషయంలో హేమంత్ తనను దూరం పెట్టడం మరింత బాధించింది. దీంతో ఈ ఘోరానికి పాల్పడ్డట్టు దొరికిన లేఖ ఆధారంగా తెలుస్తోంది.

ప్రాణం కన్నా ఎక్కువగా భావించిన ప్రాణ స్నేహితుడు మాట్లాడటం మానేశాడు. ఓ అమ్మాయి విషయంలో తొందరపడి ఓ మాట జారి నందుకు ప్రాణ స్నేహితుడిని మైత్రికి దూరమయ్యాడు. ఆ స్నేహితుడి ద్వారా పరిచయమైన మిగిలిన స్నేహితులు కూడా అతనితో మాట్లాడటం మానేశారు. దీంతో... తట్టుకోలేకపోయాడు. తనని క్షమించమని అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు. ఒక్కసారిగా అందరూ తనతో మాట్లాడటం మానేసరికి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 

అనంతపురం జిల్లా చెర్లో పల్లి మండలంలోని మద్దిపల్లికి చెందిన వేణు గోపాల్.. తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. తన తోటి స్నేహితులు తనతో మాట్లాడుకుండా ఉండటాన్ని వేణుగో పాల్ తట్టుకోలేక పోయాడు. అప్పటి వరకూ స్నేహంగా తిరిగిన తన స్నేహితులు మాట్లాడకుండా ఉండటం ఎదురుగా ఉన్నా తనను దూరంగా పెట్టడం సహించలేకపోయాడు. 

దీంతో తను ఉంటున్ హాస్టల్ బాత్‌రూమ్‌లో పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన మూడు పేజీల లేఖ విస్తుగొలుపుతోంది. తాను ఎంతో స్నేహంగా ఉండే తన మిత్రుడు హేమంత్ తనను దూరం పెట్టడంతో వేణు గోపాల్ తట్టుకోలేకపోయాడు. పైగా కొత్తగా పరిచయం అయిన అమ్మాయిల విషయంలో హేమంత్ తనను దూరం పెట్టడం మరింత బాధించింది. దీంతో ఈ ఘోరానికి పాల్పడ్డట్టు దొరికిన లేఖ ఆధారంగా తెలుస్తోంది.

పైగా లేఖలో.. ‘స్నేహం నేను ఏమీ ఇవ్వలేనని అన్నారుగా.. ఇందుకోసం నా ప్రాణమే ఇస్తున్నా’అంటూ తన ఆవేదనను తెలియపరిచాడు. ఈ లేఖ చదివిన వారికి కొన్ని స్నేహాల వల్ల చెడిపోయేవారిని చూశాం కానీ.. స్నేహం కోసం ప్రాణం తీసుకోవడం కలచివేస్తోంది. స్నేహితుల కోసం తన ప్రాణం తీసుకోవడం కలచివేస్తోందని సన్నిహితులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు. 

కళ్ల ముందు ఎదిగిన కొడుకు...చేతికి అందే సమయానికి చాలా చిన్న కారణంతో ఆత్మహత్య చేసుకోవడం అతని తల్లిదండ్రులను కుంగదీసింది. కొడుకు చావును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  

‘‘ రే నానీ, క్రాంతి, వెంకీ, దిలీప్, చంద్ర, సాయి, విష్ణు... మీ కోసం నా ప్రాణం చాలురా. మీరంతా బాగా చదివి జీవితంలో ఉన్నత స్థానానికి రావాలని కోరకుంటున్నా... మీ వేణుగోపాల్’ అంటూ లేఖ రాసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.  అందరూ అమ్మాయిల కోసం ప్రాణాలు తీసుకుంటారు.. నేను మాత్రం స్నేహితుల కోసం తీసుకుంటున్నానంటూ లేఖను ముగించడం విషాదకరం. 

click me!