గల్లా అరుణకుమారికి చంద్రబాబు పెద్ద పీట

Published : Jun 27, 2018, 07:56 AM IST
గల్లా అరుణకుమారికి చంద్రబాబు పెద్ద పీట

సారాంశం

మాజీ మంత్రి గల్లా అరుణ కుమారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేశారు. 

అమరావతి: మాజీ మంత్రి గల్లా అరుణ కుమారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేశారు. తెలుగుదేశం పోలిట్ బ్యూరోలో ఆమెకు చంద్రబాబు చోటు కల్పించారు. 

పార్టీలో అత్యున్నత నిర్ణయాక సంస్థ పొలిట్ బ్యూరోలోకి ఆమెను తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఆమె ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జీగా ఉన్నారు.

అయితే, ఆమె ఆ మధ్య చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని చంద్రబాబును కోరారు. దాంతో ఆమె పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. దానిపై గల్లా అరుణకుమారి వివరణ ఇచ్చారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?