18-45 ఏళ్లవారికి ఉచిత వ్యాక్సిన్... ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Arun Kumar P   | Asianet News
Published : Apr 23, 2021, 05:55 PM ISTUpdated : Apr 23, 2021, 06:04 PM IST
18-45 ఏళ్లవారికి ఉచిత వ్యాక్సిన్... ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

సారాంశం

కరోనా వైరస్ నుండి రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 

అమరావతి: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ వైరస్ నుండి రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సులోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఏపీలో 18-45 ఏళ్ల మధ్య వయసున్నవారు 2,04,70,364 మంది వున్నారని... అందరికీ సరిపోయేలా వ్యాక్సిన్లను రెడీగా వుంచాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. మే 1 నుంచి 18-45 ఏళ్ల మధ్య వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 

ఏపీలో కరోనా వైరస్ రోగులు భారీగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, ఇతర మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశమై పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. 

read more  విజయవాడ దుర్గగుడిలో కరోనా కల్లోలం: 43 మంది సిబ్బంది, ఐదుగురు అర్చకులకు కోవిడ్

వ్యాక్సిన్లు, రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత నుంచి బయటపడేందుకు వున్న అవకాశాలపై ముఖ్యమంత్రి దృష్టిపెట్టారు. శుక్రవారం మంత్రులతో కీలక సమావేశంలో వుండగానే.. భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణా ఎల్లా, హెటెరో డ్రగ్స్‌ ఎండీ పార్థసారథికి సీఎం జగన్ ఫోన్ చేశారు. ఏపీ అవసరాలు తీర్చే విధంగా అదనపు కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లతో పాటు, రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 

అంతకుముందు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గురువారం మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీ వివరాలను సీఎం జగన్‌కు మంత్రులు వివరించారు. ఆక్సిజన్ సప్లై, రెమిడిసివేర్, బెడ్స్ తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేలల్లోనే నమోదవుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ఏపీలో నిన్న 10 వేలకు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్