ఘరానా కేటుగాడు : చనిపోయినట్టు నమ్మించి.. రూ. 4 కోట్లు మోసం.. !

By AN Telugu  |  First Published Feb 1, 2021, 9:20 AM IST

సబ్సిడీ రుణాల పేరుతో దళితుల నుంచి రూ. 4 కోట్లు తీసుకుని మోసం చేశాడో ఘరానా కేటుగాడు. గుంటూరు జిల్ల తాడేపల్లిలో జరిగిన ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది.  వర్థన్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో సబ్సిడీ రుణాలిప్పిస్తానంటూ ఓ వ్యక్తి దళితుల నుడి రూ. 4 కోట్లు వసూలు చేసి చివరికి బోర్డు తిప్పేశాడో మోసగాడు. 
 
బోర్డు తిప్పేయడంతో తాము మోసపోయామని తెలుసుకున్న దళితులు.. ఆదివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. బాదితుల్లో తూర్పు గోదావరి జిల్లా మాదిగ ఐక్య వేదిక చైర్మన్ మడికి కిశోర్ బాబు కూడా ఉండడం విశేషం. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్ల ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన జగతపు జాషువా అనే వ్యక్తి తాడేపల్లి బైపాస్ రోడ్డులో వర్థన్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో ఓ ఆఫీసును తెరిచాడు. 

Latest Videos

కేంద్ర ప్రభుత్వం గేదెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు ఇస్తోందని.. మొదట లక్ష రూపాయలు కడితే వారి అకౌంట్ లో రూ. 1.60 లక్షలు జమ అవుతాయని నమ్మించాడు. రుణాలు కావాలనుకున్నవారు ముందుగా  లక్ష రూపాయలు కట్టి సొసైటీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పాడు. దీంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అనేకమంది దళితులు అతని మాటలు నమ్మి, వలలో చిక్కారు. దీనికింద కోట్ల రూపాయలు కట్టేశారు.

అయితే 15 రోజుల నుంచి తాడేపల్లిలోని వర్థన్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆఫీసులో ఎవ్వరూ కనిపించడం లేదని కిశోర్ బాబు తెలిపారు. దీంతో జగతపు జాషువా గురించి ఆరా తీస్తే.. అతని మీద, అతని కుటుంబ సభ్యుల మీద మూడు రాష్ట్రాల్లో 21 కేసులు నమోదైనట్టు తెలిసిందన్నారు. 

అతనోసారి నకిలీ పీటీ వారెంట్ తో జైలు నుంచి కూడా తప్పించుకున్నాడని, అంతేకాకుండా అతను చనిపోయినట్టు తను చనిపోయినట్టు సమాజాన్ని నమ్మించి కొత్త పేరుతో, కొత్త ముసుగు వేసుకుని సమాజాన్ని మోసం చేస్తున్నట్టు తెలిసిందని వివరించారు. 

click me!