కత్తులు, రాడ్లతో వైసీపీ గుండాలు దాడి చేశారు: చంద్రబాబు

Published : Feb 01, 2021, 08:42 AM IST
కత్తులు, రాడ్లతో వైసీపీ గుండాలు దాడి చేశారు: చంద్రబాబు

సారాంశం

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ గుండాలు రాళ్లు, కత్తులతో దాడులు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.

అమరావతి: రాడ్లు, కత్తులు, గొడ్డళ్లతో వైసిపి గుండాలు రోడ్లపై స్వైర విహారం చేస్తూ శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  శ్రీకాకుళం లోక్ సభ వైసిపి అభ్యర్ధి  అసభ్యపదాలతో రెచ్చగొట్టి ఈ మూకలను  హింసా విధ్వంసాలకు ప్రేరేపించారని న్నారు.

ప్రశాంతతకు నెలవైన ఉత్తరాంధ్ర హింసా, విధ్వంసాలకు వేదిక కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైసిపి రౌడీ మూకలపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసిపి గుండాలకు ప్రజలే మరిచిపోలేని గుణపాఠం త్వరలోనే చెబుతారని అన్నారు.

ఆ మేరకు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు స్పందించారు. వాహనంపై ధీమాగా కూర్చుని పోలీసుల ఎదుటే దుర్ఫాషలాడుడుతున్న దువ్వాడ శ్రీనివాస్ వీడియోను చంద్రబాబు ట్విట్టర్ లో పోస్టు చేశారు.

 

PREV
click me!

Recommended Stories

తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar
ఆ ఇంజ‌క్ష‌న్ల వాడ‌కంపై ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌.. 100 మెడికల్ షాపుల్లో తనిఖీలు