చంద్రబాబు అన్నా క్యాంటీన్లలో కోట్ల ఫ్రాడ్: అధికారులపై వేలాడుతున్న కత్తి

By telugu teamFirst Published Sep 8, 2019, 9:54 AM IST
Highlights

చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల వ్యవహారంలో రూ.53 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు వైెఎస్ జగన్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. ఐదు రూపాయలకు భోజనం పెట్టే అన్నా క్యాంటీిన్లను జగన్ ప్రభుత్వం మూసేసిన విషయం తెలిసిందే.

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి హయాంలో ప్రారంభమైన అన్నా క్యాంటీన్ల వ్యవహారంలో కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూసేసిన విషయం తెలిసిందే. వాటిపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.

అన్నా క్యాంటీన్ల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 53 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు కమిటీ తేల్చింది. ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్ ఈ వ్యవహారంపై ప్రచురించిన వార్తాకథనం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక తన వద్ద ఉందని దక్కన్ క్రానికల్ చెబుకుంది.

అన్నా క్యాంటీన్లలో నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఐదు రూపాయలకే భోజనం పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది.

దక్కన్ క్రానికల్ వార్తాకథనం ప్రకారం.... నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం రెండు ప్యాకేజీలు ఉన్నాయి. ఒక ప్యాకేజీ 163 ప్రాంతాలకు సంబంధించింది కాగా, రెండోది 40 ప్రాంతాలకు సంబంధించింది. మొత్తం 203 క్యాంటీన్లకు ఖర్చు అంచనాను ఒకే విధంగా రూపొందించారు. ఇది సాంకేతికంగా సరైంది కాదు. ప్రాంతాలను బట్టి క్యాంటీన్ల ఏర్పాటుకు, నిర్వహణకు ఖర్చులు మారుతూ ఉంటాయి. 

కొన్ని క్యాంటీన్లకు ఎక్కువ, కొన్ని క్యాంటీన్లకు తక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంది. అందువల్ల అన్ని క్యాంటీన్లకు పెట్టే ఖర్చు ఒకే విధంగా ఉండదు. స్థానిక పరిస్థితులను బట్టి ఖర్చు మారుతూ ఉంటుంది. క్యాంటీన్ల భవనాలకు అవాంఛనీయమైన ఖర్చులు పెట్టారని కమిటీ తెల్చింది.ప్రతి క్యాంటీన్ భవనానికి 8.98 లక్షల చొప్పున ఖర్చు చేశారని, ఇందులో రూ.20.25 లక్షలు పొదుపు చేయడానికి అవకాశం ఉండిందని కమిటీ తేల్చింది.

click me!