100 రోజులకే మతి భ్రమిస్తే ఎలా..? అసలైంది ముందుంది : బాబుపై డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణి ఫైర్

By Nagaraju penumalaFirst Published Sep 7, 2019, 7:00 PM IST
Highlights

100 రోజుల పాలనకే చంద్రబాబు మతి భ్రమించిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 100 రోజులకే ఇలా అయిపోతే ముందుంది ముసళ్లపండగ అంటూ సెటైర్లు వేశారు. సీఎం జగన్ ను విమర్శించే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదన్నారు. 
 

అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ 100 రోజుల పాలన చూసి చంద్రబాబుకు ఏం చేయాలో తోచడం లేదని విమర్శించారు. 

100 రోజుల పాలనకే చంద్రబాబు మతి భ్రమించిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 100 రోజులకే ఇలా అయిపోతే ముందుంది ముసళ్లపండగ అంటూ సెటైర్లు వేశారు. సీఎం జగన్ ను విమర్శించే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదన్నారు. 

వందేళ్లలో కూడా పూర్తి కావనుకున్న పనులను వందరోజుల్లో పూర్తి చేసిన గొప్ప నాయకుడు సీఎం జగన్ అంటూ కొనియాడారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేపట్టని సంస్కరణలను, కీలక నిర్ణయాలను జగన్ 100 రోజుల్లో చేపట్టారని చెప్పుకొచ్చారు. 

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే లక్షా 33 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత వైయస్ జగన్ కే దక్కుతుందన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఏనాడైనా ఇంతటి నిర్ణయం తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. 

దేశంలోనే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో లక్షా 33వేల ఉద్యోగాలు ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ సీఎం వైయస్ జగన్ అంటూ ప్రశంసించారు. అది జగన్ పరిపాలన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నామినేటెడ్‌ పోస్టుల్లో  50 శాతం రిజర్వేషన్లు, పనుల్లో 50 శాతం వాటా ఇచ్చిన ఘనత తమ ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. కల్లోనైనా చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోసం ఆలోచించారా అంటూ మండిపడ్డారు. 

పునరావాస కేంద్రాల పేరుతో మాజీ సీఎం చంద్రబాబు డ్రామాలాడుతున్నారంటూ పుష్ప శ్రీవాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారాయణ కాలేజీల్లో 25 మంది ఆడపిల్లలు చనిపోయినప్పుడు, ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని ప్రభాకర్‌ కొట్టినప్పుడు ఎందుకు పునరావాస కేంద్రాలు పెట్టలేదో చెప్పాలని నిలదీశారు. 

తన పార్టీ ఎమ్మెల్యేలు, నేతల్ని కాపాడుకోవడానికే బాబు పునరావాస కేంద్రాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని ఏం విమర్శించాలో తెలియక పెయిడ్ ఆర్టిస్టులతో దుష్ప్రచారానికి తెగబడ్డారని, ఇప్పటికయినా అబద్దాలు మాని చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి హితవు పలికారు. 

click me!