
విజయవాడ కృష్ణానదిలో మరో విషాదం చోటు చేసుకుంది.. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరంతా కంచికచర్లలోని ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు.. వీకెండ్ కావడంతో నలుగురు విద్యార్థులు ఫెర్రీ వద్ద ఉన్న పవిత్ర సంగమం వద్దకు వెళ్లారు. వీరిలో ఒక విద్యార్థి స్నానం చేసేందుకు నదిలోకి దిగాడు.. అయితే ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు.. ఇతనిని కాపాడేందుకు మిగిలిన ముగ్గురు కూడా నదిలోకి దూకడంతో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.. గల్లంతైన వారిని ప్రవీణ్, చైతన్య, శ్రీనాథ్, రాజ్‌కుమార్‌గా గుర్తించారు.