పిఠాపురంలో కలకలం... ఒకే స్కూళ్లో చదివే నలుగురు బాలికలు మిస్సింగ్

Arun Kumar P   | Asianet News
Published : Apr 03, 2022, 10:12 AM IST
పిఠాపురంలో కలకలం... ఒకే స్కూళ్లో చదివే నలుగురు బాలికలు మిస్సింగ్

సారాంశం

ఒకే స్కూళ్లో పదోతరగతి చదువుతున్న నలుగురు బాలికలు వరుసగా కనిపించకుండా పోవడం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కలకలం రేపుతోంది. విద్యార్థినుల ఆఛూకీ కోసం తల్లిదండ్రులతో పాటు పోలీసులు కూడా గాలిస్తున్నారు. 

పిఠాపురం: ఒకే పాఠశాలలో పదోతరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినిలు అదశ్యమైన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపుతోంది. గత మూడునాలుగు రోజుల నుండి అమ్మాయిలు కనిపించకుండా తల్లిదండ్రుల కంగారు పడుతున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం ఇద్దరు అమ్మాయిలు మాత్రమే కనిపించడం లేదని ఫిర్యాదులు అందాయని... మరో ఇద్దరు అమ్మాయిల అదృశ్యంపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. దీంతో అమ్మాయిల అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక గత నెల(మార్చి) 30వ తేదీన అదృశ్యమయ్యింది. ఆ రోజు ఉదయం స్కూల్ కి వెళుతున్నానంటూ ఇంట్లోంచి బయటపడ్డ బాలిక సాయంత్రమయినా ఇంటికి చేరుకోలేదు. దీంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు పాఠశాలతో పాటు ఇంటి చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకుండా పోయింది. బాలిక స్నేహితులు, బంధువులను సంప్రదించినా బాలిక ఆఛూకీ లభించలేదు. 

ఇదిలావుంటే ఇదే పాఠశాలలో పదోతరగతి చదువుతున్న మరో ముగ్గురు బాలికలు కూడా గత శనివారం తెల్లవారుజామునుండి కనిపించకుండా పోయారు. ఇలా నలుగురు బాలికలు అదృశ్యమవడం పిఠాపురంలో కలకలం రేపుతోంది. అదృశ్యమైన విద్యార్థినుల తల్లిదండ్రులతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు.  

ఇప్పటివరకు ఇద్దరు బాలికల అదృశ్యంపై తమకు ఫిర్యాదులు అందినట్లు పిఠాపురం పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి ఆఛూకీ కోసం గాలిస్తున్నట్లు... సాంకేతిక ఆదారాలు, పట్టణంలోని సిసి కెమెరా రికార్డుల ఆదారంగా బాలికలు హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలుస్తోందని అన్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులకు బాలికల ఫోటోలు, వివరాలు పంపినట్లు పిఠాపురం పోలీసులు తెలిపారు. త్వరలోనే బాలికల ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. 

అయితే ఇటీవల కనిపించకుండా పోయిన ఈ నలుగురు బాలికల ప్రవర్తన బాగాలేకపోవడంతో ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు తెలిపారు. అంతేకాదు తల్లిదండ్రుల సమక్షంలోనే బాలికలను ఉపాధ్యాయులు మందలించారు. విద్యార్థులు ఇళ్లువదిలి వెళ్లడానికి ఇదేమయినా కారణమా? లేక వేరే కారణాలేమయినా వున్నాయా? అన్నకోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.    

PREV
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు