భారీ అగ్నిప్రమాదం, రక్తం మరకలు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Published : Apr 15, 2021, 08:30 AM ISTUpdated : Apr 15, 2021, 10:47 AM IST
భారీ అగ్నిప్రమాదం, రక్తం మరకలు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

సారాంశం

విశాఖలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలోని మధురవాడలో గల ఆదిత్య ఫార్యూన్ లో ఆ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం మధురవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మధురవాడలోని ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో ఆ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. 

అయితే ఘటనా స్థలంలో రక్తం మరకలు కనపించాయి. దీంతో మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. 

ఆ సంఘటన గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగింది. ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో దాదాపు వంద ఫ్లాట్స్ ఉంటాయి. మృతులను బంగారు నాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా గుర్తించారు. బంగారునాయుడు ఆ ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నట్లు తెలుసతోంది. 

మృత్యువాత వడిన ఎన్నారై కుటుంబం 8 నెలల క్రితం అపార్టుమెంటులోకి వచ్చారు. ఆ కుటుంబం విజయనగరం జిల్లా గంట్యాడ నుంచి వచ్చి ఈ అపార్టుమెంటులో ఉంటుంది.

వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Bhumana Karunakar Reddy: కూటమి పాలనలో దిగ‌జారుతున్న తిరుమ‌ల ప్ర‌తిష్ట | TTD | Asianet News Telugu
పోలవరం, అమరావతి మాటల్లోనే.. చేతల్లో శూన్యంPerni Nani Slams Alliance Government | Asianet News Telugu