తిరుపతి బైపోల్: గురుమూర్తి మతంపై వివాదం.. హిందువో, కాదో చెప్పాలంటూ జీవీఎల్ డిమాండ్

By Siva KodatiFirst Published Apr 14, 2021, 6:14 PM IST
Highlights

తిరుపతి వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి హిందువో , కాదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. నామినేషన్‌కు ముందు గురుమూర్తి ఒక బిషప్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

తిరుపతి వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి హిందువో , కాదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. నామినేషన్‌కు ముందు గురుమూర్తి ఒక బిషప్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. దీనికి వైసీపీ సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

యేసు క్రీస్తుపై చూపించే అభిమానం, ఆరాధానను శ్రీవెంకటేశ్వరస్వామి సహా ఇతర హిందూ దేవీదేవతల పట్ల గురుమూర్తి చూపించలేదని ఆయన ఎద్దేవా చేశారు. బిషప్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి గురుమూర్తి వెళ్లారా లేదా అన్న దానిపై క్లారిటీ ఇవ్వాలని నరసింహారావు కోరారు. 

అంతకుముందు వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి హిందువు కాదంటూ ట్వీట్ చేశారు బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్ సునీల్ డియోధర్. దీనిపై స్పందించిన గురుమూర్తి.. తాను హిందువునేనని ఆధారాలు విడుదల చేశారు.

వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని దర్శించుకున్న వీడియోను విడుదల చేశారు. తిరుపతి ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు చేసేముందు తమ వూరి గ్రామ దేవతలకు పూజలు చేసిన ఫోటోలను కూడా విడుదల చేశారు.

Also Read:నేను హిందువునే.. ఇవిగో ఆధారాలు: సునీల్ డియోధర్‌కు గురుమూర్తి కౌంటర్

పది ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు గురుమూర్తి. అంతకుముందు సునీల్ డియోధర్‌పై విరుచుకుపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గురుమూర్తికి మద్ధతుగా ఆదివారం వైసీపీ నేతలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏది బడితే మాట్లాడుతున్నారని.. సునీల్ డియోధర్ అనే వ్యక్తి మేఘాలయా ఇన్‌ఛార్జ్‌గా వున్నారని గుర్తుచేశారు. అక్కడ ఏం చేశారో ప్రజలందరికీ తెలుసునని రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గురుమూర్తి కుటుంబ నేపథ్యం, మత సంబంధిత విషయాలు మాట్లాడటం సరికాదని.. అంత దిగజారి మాట్లాడిన అవసరం లేదంటూ కౌంటరిచ్చారు పెద్దిరెడ్డి. 

click me!