పిల్లల అదృశ్యం కథ సుఖాంతం.. ఎక్కడంటే..?

By Rajesh KarampooriFirst Published Nov 25, 2023, 12:57 AM IST
Highlights

తెనాలిలో పిల్లల అదృశ్యం కథ సుఖాంతంగా ముగిసింది. తెనాలిలో అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ విజయవాడ లో ఉన్నట్టు కనుగొన్నారు పోలీసులు . ముగ్గురు పిల్లలు విజయవాడ లో ఓ పార్కులో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. పిల్లల్ని తీసుకువచ్చేందుకు విజయవాడ నుండి తెనాలి వెళ్లారు. 

గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఒకే సమయంలో నలుగురు పిల్లలు కనిపించకుండా పోయడం కలకలం రేపింది. అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ పోలీసులకు సవాల్ గా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో ఆ పిల్లల ఆచూకీ లభించింది. తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అందించడంతో ఆ మిస్సింగ్ కథ సుఖాంతంగా మారింది. 

అందిన సమాచారం ప్రకారం.. చినరావూరు తోట పోతురాజు కాలనీలో నివాసం ఉండే పంది మాల్యాద్రి-లతల కుమార్తె రాధిక (13), కుమారుడు రాఘవేంద్ర (8) శుక్రవారం ఉదయం నుంచి కనిపించడం మానేశారు. తల్లిదండ్రులిద్దరూ ఉదయం కూలీ నిమిత్తం బయటకు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి వారి పిల్లలిద్దరూ కనిపించకుండా పోయారు. మాల్యాద్రి దంపతులు ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందినవారు. గత ఆరునెలల క్రితం కూలి పనులకు నిమిత్తం పోతురాజు కాలనీలో నివాసముంటున్నారు.  

Latest Videos

ఇదిలా ఉండగా 14వ వార్డు చినరావూరు తోట స్మశానం రోడ్డు ప్రాంతానికి చెందిన షేక్ జానీ కుమారుడు అల్తాఫ్ (9), షేక్ బాషా కుమారుడు ఆరిఫ్ (7) కూడా కనిపించకుండా పోయారు. ఇలా ఒకే ప్రాంతానికి చెందిన నలుగురు పిల్లలు అదృశ్యం కావడం పట్టణంలో కలకలం రేపింది. పిల్లల కోసం తల్లిదండ్రులు తీవ్రంగా వెతికారు. అయినా ఫలితంగా లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

తల్లిదండ్రల ఫిర్యాదు మేరకు రంగంలో దిగారు పోలీసులు. ఫిర్యాదు చేయడం కోసం పోలీసులు  నాలుగు బృందాలుగా విడిపోయారు. ఈ క్రమంలో అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ లభించింది.  అందులో ముగ్గరు చిన్నారులు విజయవాడ లో ఓ పార్కులో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. ఇలా విజయవాడ నుండి తెనాలి తీసుకువచ్చేందుకు వెళ్లారు 
పోలీసులు. ఇలా పిల్లల అదృశ్యం కథ సుఖాంతంగా ముగిసింది.

click me!