బిగ్ బ్రేకింగ్.. విజయవాడ దుర్గగుడి ఛైర్మన్ పై హత్యయత్నం..ఆస్పత్రికి తరలింపు

Published : Nov 24, 2023, 10:52 PM ISTUpdated : Nov 24, 2023, 10:56 PM IST
బిగ్ బ్రేకింగ్.. విజయవాడ దుర్గగుడి ఛైర్మన్ పై హత్యయత్నం..ఆస్పత్రికి తరలింపు

సారాంశం

Durga Temple Vijayawada: దుర్గగుడి చైర్మన్ పై హత్యాయత్నం జరిగింది.  గాజు సీసాతో కర్నాటి రాంబాబుపై  గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. కడుపులో గాయాలు కావడంతో  అతడ్ని ఆసుపత్రి కి తరలించారు.

Durga Temple Vijayawada: దుర్గగుడి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబుపై గుర్తు తెలియని వ్యక్తి హత్యయత్నం చేశాడు. దీంతో గాజు సీసాతో దాడి చేయడంతో రాంబాబు తీవ్రంగా గాయాలయ్యాడు. ప్రైవేటు ఆస్పత్రిలో రాంబాబు చికిత్స పొందుతున్నారు. రాంబాబుకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ దాడి చేసిన వ్యక్తిని రాంబాబు అనుచరులు దొరకబడి చితకబాదారు. అనుచరులు దాడిలో కృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

ఇటీవలే దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తండ్రి మరణించారు. ఈ క్రమంలో స్మశానంలోని తండ్రి సమాధి వద్ద దీపం పెట్టడానికి వెళ్లిన రాంబాబుపై దాడి జరిగింది. గుర్తితెలియని వ్యక్తి వెనుక నుండి వచ్చి సీసాతో దాడి చేశాడు. ఈ దాడిని పసిగట్టి పెను ప్రమాదం తప్పింది. దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

లోకేష్ పంచ్ లకి పడి పడి నవ్విన టీచర్స్ Nara Lokesh Meets Teachers Returned from Singapore Study Tour
ఇలా చేస్తే ఒక్క క్లిక్ తో ఏ సబ్జెక్టువీక్ ఉన్నాడో ఈజీగా తెలిసిపోతుంది | Nara Lokesh Meets Teachers