బాపట్లలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి...

By SumaBala BukkaFirst Published Dec 5, 2022, 9:12 AM IST
Highlights

బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మరణించారు.

బాపట్ల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని వద్ద అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న టాటా ఎస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మరణించారు. మరో 16 మంది గాయపడ్దారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను తెనాలి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైనవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రిష్ణా జిల్లా నిలపూడికి చెందినవారిగా గుర్తించారు.

ఇదిలా ఉండగా, నవంబర్ 27న ఇలాంటి ప్రమాదమే ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుగో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఉమ్మడి  ప్రకాశంజిల్లా ఒంగోలు సమీపంలో  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 32 మంది అయ్యప్ప  భక్తులు గాయాల బారిన పడ్డారు. ఓ ప్రైవేట్ బస్సులో అనకాపల్లిజిల్లా డీఎల్ పురం గ్రామానికి చెందిన అయ్యప్పభక్తులు శనివారం శబరిమలకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు ఆదివారం నాడు  తెల్లవారుజామున ఒంగోలుకు సమీపానికి చేరుకుంది. ఈ సమయంలో టిప్పర్ ను ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం  నుజ్జునుజ్జైంది. 

విశాఖపట్నంలో దారుణం.. నీళ్ల డ్రమ్ములో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం.. చంపి, ముక్కలు చేసి..

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు ప్రమాదంలో గాయపడిన  అయ్యప్ప భక్తులను ఆసుపత్రికి  తరలించారు.  ఈ సమయంలో బస్సులో 43 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో వీరిలోని 32 మంది గాయపడ్డారు. అయితే, ప్రమాదానికి కారణం.. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమేనని.. దీనివల్లే బస్సు టిప్పర్ ను ఢీకొట్టిందని బస్సులోని అయ్యప్ప భక్తులు చెబుతున్నారు.

కాగా, నవంబర్ 19న ఆంధ్ర ప్రదేశ్ యాత్రికులతో శబరిమలకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న బస్సు పతనంతిట్ట సమీపంలో లోయలో పడిపోయింది. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు కొండ ఎక్కుతుండగా అదుపుతప్పి కిందపడినట్లు అనుమానిస్తున్నారు.  ప్రమాద సమయంలో బస్సులో 44 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఎనిమదేళ్ల బాలుడితో సమా ముగ్గురి పరిస్తితి విషమంగా ఉంది. 

click me!