ఈ నెల 8న పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం.. ఆహ్వానాలు వీరికే

Siva Kodati |  
Published : Dec 04, 2022, 09:23 PM ISTUpdated : Dec 04, 2022, 09:31 PM IST
ఈ నెల 8న పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం.. ఆహ్వానాలు వీరికే

సారాంశం

ఈ నెల 8న పార్టీ నేతలతో ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.  రానున్న ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా నాయకులకు జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం వుందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

ఈ నెల 8న పార్టీ నేతలతో ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, కొత్తగా నియమించిన అబ్జర్వర్లతో జగన్ భేటీ కానున్నారు. రానున్న ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా నాయకులకు జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం వుందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

ALso REad:175 సీట్లు సాధించడం కష్టం కాదు.. విశాఖ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలతో జగన్

ఇకపోతే.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో జగన్ విడివిడిగా సమావేశం అవుతూ వస్తున్నారు. ఇప్పటికే అద్దంకి, కర్నూలు జిల్లా ఆలూరు, విశాఖ నార్త్ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే