ఉద్దవోలు టీచర్ కృష్ణ హత్య కేసులో నలుగురు అరెస్ట్: ఎస్పీ దీపిక

By narsimha lode  |  First Published Jul 16, 2023, 5:01 PM IST

విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన  కృష్ణ హత్య కేసులో నలుగురిని  పోలీసులు అరెస్ట్ చేశారు. 


విజయనగరం: జిల్లాలోని తెర్లాం మండలం ఉద్దవోలుకు  చెందిన  టీచర్ ఏగిరెడ్డి కృష్ణ  హత్య కేసులో  నలుగురిని పోలీసులు  అరెస్ట్  చేశారు.  ఈ హత్య ఘటనకు సంబంధించిన వివరాలను  జిల్లా ఎస్పీ  దీపిక  ఆదివారంనాడు  మీడియాకు వివరించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకటనాయుడు  అతనికి సహకరించిన  రామస్వామి, మోహన్, గణపతిలను  అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ చెప్పారు. పథకం ప్రకారంగానే కృష్ణను ప్రత్యర్థులు హత్యచేశారని ఎస్పీ తెలిపారు.

Latest Videos

undefined

కృష్ణను భౌతికంగా లేకుండా చేయాలని ప్లాన్  చేశారని ఎస్పీ దీపిక చెప్పారు.  స్కూల్ కు  వెళ్తున్న కృష్ణను  బొలేరో వాహనంతో ఢీకొట్టి  ఆ తర్వాత  ఇనుప రాడ్ తో కొట్టి చంపారని ఎస్పీ వివరించారు. ఉద్దవోలులో   వెంకటనాయుడు వర్గీయులు  కొన్ని నిర్మాణాలు చేపట్టారన్నారు. ప్రభుత్వ నిధులతో ఈ భవనాలు నిర్మించారు.  అయితే  ఈ బిల్లులు రాకుండా  కృష్ణ  ప్రభుత్వానికి ఫిర్యాదు చేయించారని వెంకటనాయుడు  కక్ష పెంచుకున్నారని  ఎస్పీ చెప్పారు. ఈ విషయమై  కృష్ణ చంపాలని వెంకటనాయుడు  హత్య చేయాలని ప్లాన్ చేశారని తమ దర్యాప్తులో తేలిందని  ఎస్పీ తెలిపారు. 

also read:విజయనగరం ఉద్దవోలులో టీచర్ కృష్ణ హత్య: అనుమానితుల ఇళ్ల ముందు ఆందోళన, టెన్షన్

శనివారంనాడు  స్కూల్ కు వెళ్తున్న టీచర్ కృష్ణను  ప్రత్యర్థులు వాహనంతో ఢీకొట్టి హత్య చేశారు.  కృష్ణ హత్యతో గ్రామంలో  ఉద్రిక్తత నెలకొంది.  వెంకటనాయుడి ఇంటి ముందు  ఇవాళ కృష్ణ మద్దతుదారులు ఆందోళనకు దిగారు.  కృష్ణ సోదరుడి ఇంటిపై కూడ దాడికి దిగారు.  ఈ దాడులను  పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.  గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు  చేశారు.

 గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరూ  కూడ శాంతి భద్రతలకు విఘాతం కల్గించవద్దని ఎస్పీ కోరారు.  గ్రామంలో గొడవలు సృష్టిస్తే  కఠినంగా శిక్షిస్తామని  ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. 
 

click me!