ఎన్టీఆర్ పేరు చెప్పి చంద్రబాబును కడగేసిన పురంధేశ్వరి

First Published Jul 21, 2018, 1:24 PM IST
Highlights

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ సంజీవని అన్న టీడీపీ నేతలు మాట మార్చారని మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరీ విమర్శించారు.  కేంద్రంపై విమర్శలు చేసే ముందు ఆలోచించుకోవాలని  ఆమె హితవు పలికారు.


అమరావతి: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ సంజీవని అన్న టీడీపీ నేతలు మాట మార్చారని మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరీ విమర్శించారు.  కేంద్రంపై విమర్శలు చేసే ముందు ఆలోచించుకోవాలని  ఆమె హితవు పలికారు.అవిశ్వాసానికి మద్దతుగా నిలిచిన పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరాయా చెప్పాలని  ఆయన డిమాండ్ చేశారు.

శనివారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రం సహకరించలేదని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఆమె మండిపడ్డారు. కేంద్రం భాగస్వామ్యంతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు.

ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.  రాబోయే రోజుల్లో ప్రజలు తమను ఆదరిస్తారనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. కేంద్రంపై  అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీ నేతలు  తప్పుడు ప్రచారాన్ని చేశారని  ఆమె మండిపడ్డారు.

టీడీపీ నేతల ప్రచారం గోబెల్స్  ప్రచారాన్ని మించిపోయాయని  ఆమె చెప్పారు.  టీడీపీ నేతలు చెప్పేవన్నీ అబద్దాలన్నారు.  కాంగ్రెస్ పార్టీతో కలిసి రాజకీయం చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. ఈ పరిణామం ఎన్టీఆర్ ఆత్మను క్షోభపడేలా చేస్తోందన్నారు.  ఢిల్లీకి వెళ్లి చంద్రబాబునాయుడు ఎవరికీ  ధన్యవాదాలు చెబుతారని ఆమె ప్రశ్నించారు. 

రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జర,గడానికి చంద్రబాబు కారణం కూడ  కారణమేనని ఆమె  చెప్పారు.  రాష్ట్రానికి ఏం చేయడానికైనా కేంద్రం సిద్దంగా ఉందని పురంధరేశ్వరీ చెప్పారు. రైల్వేజోన్‌ను ఇవ్వమని కేంద్రం ఏనాడూ చెప్పలేదన్నారు. 

click me!