సీఐ తిట్టాడని రాజీనామా చేసి.. సివిల్స్ లో విజయం సాధించాడు! ఆంధ్ర పోలీస్ సక్సెస్ సోర్టీ.. 

Published : Apr 17, 2024, 07:21 PM IST
సీఐ తిట్టాడని రాజీనామా చేసి.. సివిల్స్ లో విజయం సాధించాడు! ఆంధ్ర పోలీస్ సక్సెస్ సోర్టీ.. 

సారాంశం

తాజాగా యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ పరీక్షా ఫలితాల్లో ఓ అరుదైన విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి అనే యువకుడు సివిల్స్ ఫలితాల్లో 780వ ర్యాంక్ సాధించి అఖిల భారత సర్వీసు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. అయితే.. ఆయన అసాధారణ విజయం వెనుక ఓ అవమాన ఘటన ఉంది.ఆ కథేంటో తెలుసుకుందాం..  

తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయడంతో నాన్నమ్మ వద్దనే పెరిగాడు. తన నానమ్మ పడ్డ కష్టాన్ని గుర్తించిన ఆ యువకుడు పట్టుదలతో చదివి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. కానీ, ఆ కారణంగా ఓ  ఉన్నతాధికారి తనని అవమానించడాని వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తనను అవమానించిన వారితోనే సలాం కొట్టించుకోవాలని సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యాడు. మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైనప్పటికీ ఆత్మవిశ్వాసం సడలకుండా నాలుగోసారి ఉత్తమ ర్యాంకు సాధించారు. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 780వ ర్యాంకు సాధించాడు. అతనే ప్రకాశం జిల్లాకు చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి. 
 
తాజాగా యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ పరీక్షా ఫలితాల్లో ఏపీలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి అనే యువకుడు సివిల్స్ ఫలితాల్లో 780వ ర్యాంక్ సాధించాడు. వాస్తవానికి ఉదయ్‌కృష్ణారెడ్డి చిన్నతనంలోనే తల్లి జయమ్మ చనిపోయారు. దీంతో తన తండ్రి శ్రీనివాసులురెడ్డి పెంచారు. కానీ, ఉదయ్‌ ఇంటర్‌ చదువుతున్న సమయంలో తండ్రి శ్రీనివాసులు చనిపోయారు. ఈ ఘటనతో ఉదయ్‌ ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో నానమ్మ రమణమ్మ వారి బాధ్యతలు తీసుకున్నారు. ఉదయ్‌కృష్ణారెడ్డికి ప్రతి విషయంలో  నానమ్మ కొండంత అండగా నిలిచారు. మనవడిని కూలీనాలి చేసుకుంటూ.. కష్టపడి చదివించింది. 

తన  నానమ్మ పడ్డ కష్టాన్ని గుర్తించిన ఉదయ్ కృష్ణారెడ్డి పట్టుదలతో చదివి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. 2013 నుంచి 2018 వరకూ ఏపీలోని ప్రకాశం జిల్లాలో కానిస్టేబుల్ గా పనిచేసాడు. ఆ సమయంలో తన ఉన్నతాధికారి (సీఐ) చేతిలో ఉదయ్ కృష్ణారెడ్డికి ఓ రోజు ఘోర అవమానం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. తనను అవమానించిన వారితోనే సలాం కొట్టించుకోవాలని సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యాడు. ఎలాగైనా సివిల్స్ లో ర్యాంక్ సాధించి ఐఏఎస్ అధికారి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం ఆయన రేయింబగలు శ్రమించారు. ఈ క్రమంలో మూడు సార్లు విఫలమైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో నాలుగోసారి ఉత్తమ ర్యాంకు సాధించారు. చివరికి అనుకున్నది సాధించాడు.
 
తాను కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేయడానికి కారణాలు వెల్లడిస్తూ.. తాను కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక ఉన్నతాధికారి (సీఐ) తనను అకారణంగా 60 మంది పోలీసుల ముందు తిట్టారని, అందులో తన తప్పు ఏం లేదని, అలా తిట్టడంతో అదే రోజే తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. దీంతో అప్పటి నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వడం ప్రారంభించినట్టు స్పష్టం చేశారు. ఐఏఎస్‌ సాధించాలనే పట్టుదలతో చాలా కష్టపడి చదివాననీ, మూడు సార్లు తన ప్రయత్నంలో విఫలమైనా.. నిరాశ చెందకుండా ఈ సారి ఉత్తమ ర్యాంకు సాధించానని తెలిపారు. అయితే.. ప్రస్తుతం తాను సాధించిన 780వ ర్యాంకుతో ఇండియన్ రెవెన్యూ సర్వీసు ఉద్యోగం మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో మరోసారి సివిల్స్ రాసి ఎలాగైనా ఐఏఎస్ సాధిస్తానని కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu