పోలవరంలో భారీ అవినీతి

First Published Dec 9, 2017, 12:11 PM IST
Highlights
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో బారీగా అవినీతి జరిగిందా?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో బారీగా అవినీతి జరిగిందా? మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలు అవుననే అంటున్నారు. చంద్రబాబునాయుడు వైఖరి చూస్తుంటే ఉండవల్లి ఆరోపణల్లో నిజముందనే అనిపిస్తోంది. శనివారం మీడియాతో ఉండవల్లి మాట్లాడుతూ, ప్రతిపక్షాలతో పాటు మిత్రుడు పవన్ కల్యాణ్ కూడా అడుగుతున్నప్పుడు పోలవరం ప్రాజెక్టు వ్యయంపైన, నిర్మాణం తీరుపైన శ్వేతపత్రం విడుదల చేయటానికి చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారంటూ నిలదీసారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పనులపై చంద్రబాబు కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతున్నట్లు మండిపడ్డారు. ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే కాంట్రాక్టరుకు బిల్లులు ఎల చెల్లిస్తుందని ధ్వజమెత్తారు.

కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం పంపుతున్న నివేదికలపై చర్చించేందుకు తాను సిద్దమంటూ స్పష్టం చేశారు. తనతో ప్రభుత్వం తరపున ఎవరైనా చర్చకు వస్తారా అంటూ సవాలు విసిరారు. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. మిగిలిన ప్రాజెక్టులకు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధం లేదన్నారు. అందుకే పోలరవంకు ప్రత్యేకంగా ఓ కేంద్రం అథారిటీని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. నిర్మాణ బాద్యత అథారిటీపైన ఉన్నపుడు అథారిటికి తెలీకుండా చంద్రబాబు టెండర్లు ఎలా పిలుస్తారంటూ ఉండవల్లి ప్రశ్నించారు.

 

click me!