తిరుమలపై సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలకు లగడపాటి కౌంటర్

Published : Mar 10, 2021, 02:48 PM ISTUpdated : Mar 10, 2021, 02:53 PM IST
తిరుమలపై సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలకు లగడపాటి కౌంటర్

సారాంశం

 ప్రభుత్వ పరిధిలో ఉన్నందునే టీటీడీ ఆలయంపై ఎవరూ కూడ వేలేత్తి చూపడం లేదని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు.


అమరావతి: ప్రభుత్వ పరిధిలో ఉన్నందునే టీటీడీ ఆలయంపై ఎవరూ కూడ వేలేత్తి చూపడం లేదని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు.

టీటీడీపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకుండా ఉండాలని కోరుతూ కోర్టులో కేసు వేస్తానన్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలపై లగడపాటి రాజగోపాల్ స్పందించారు. ఈ విషయమై ఆయన ఓ తెలుగు మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.వేలాది కోట్ల రూపాయాలు ఆదాయం వచ్చే టీటీడీ లాంటి సంస్థలు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే అనేక అనుమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు.

also read:టీటీడీపై ప్రభుత్వ పెత్తనం పోవాలి, బాబు వ్యాఖ్యలపై కోర్టుకు: సుబ్రమణ్యస్వామి

దక్షిణాదిన ఆలయాలకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఉత్తరాదిన ఆలయాలకు ఆదాయం తక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ఉత్తరాది ఆలయాలకు స్వతంత్రంగా పాలకవర్గాలు ఉంటాయని ఆయన చెప్పారు.ఈ విషయాలపై కోర్టులు సరైన నిర్ణయం తీసుకొంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

టీటీడీపై ప్రభుత్వ పెత్తనం ఉండొద్దనేది ఎంపీ సుబ్రమణ్యస్వామి డిమాండ్. గతంలో నటరాజస్వామి ఆలయంపై ప్రభుత్వ పెత్తనాన్ని లేకుండా తాను చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.

టీటీడీపై ప్రభుత్వ పెత్తనం లేకుండా చేయాలని ఆయన కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్