బస్సుల సీజ్: జగన్ టార్గెట్ చేసి వేధిస్తున్నాడని జేసీ సంచలన వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Nov 7, 2019, 1:47 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రిబ్యునల్ చెప్పినా కూడ తన ట్రావెల్స్ బస్సులను వదలడం లేదన్నారు. 

అమరావతి:ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీలో చేరితే ఎలాంటి కేసులు ఉండవని తమపై ఒత్తిడి చేస్తున్నారని దివాకర్ రెడ్డి చెప్పారు. ఇలానే ఎదురుతిరిగితే తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

Also read:టీడీపీ నేత ఇంటి చూట్టూ నాపా రాళ్ళు పాతిన వైసీపీ నేత!

గురువారం నాడు అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బస్సు టైం‌కు రాలేదనే పేరుతో బస్సును సీజ్ చేశారని  జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కొందరిని టార్గెట్ చేసుకొని ప్రవర్తిస్తున్నాడని జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు.

తాను లక్ష్యంగా చేసుకొన్న వారిని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆర్ధికంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఏ రాష్ట్రంలోనూ, ఏ ముఖ్యమంత్రి కూడ ఇలా చేయలేదని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేశారు.

దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 80 బస్సులను  సీజ్ చేసినట్టుగా చెప్పారు. ట్రిబ్యునల్ చెప్పినా కూడ ఆర్టీఓ అధికారులు బస్సులు వదలడం లేదని జేసీ మండిపడ్డారు. ట్రావెల్స్ సీజ్ చేయడం వల్ల కలిగే నష్టాన్ని అధికారులు భరించాల్సి ఉంటుందని జేసీ చెప్పారు.సీఎం చెప్పినట్టు వినకపోతే సీఎస్‌కు బదిలీ తప్పలేదని గుర్తు చేశారు.

ట్రిబ్యునల్ చెప్పినా బస్సులను విడవకపోవడంపై ఆర్టీఓ వరప్రసాద్‌పై కోర్టులో కేసులు వేస్తామని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. పార్టీలో చేరాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు, మా నాన్న మూడు దఫాలు ఐదున్నర ఏళ్ల పాటు జైలులో ఉన్నాడని జేసీ దివాకర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాను దొంగతనం చేయలేదు, లంచం తీసుకోలేదు, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపితే ప్రజలే  నిర్ణయం తీసుకొంటారని ఆయన చెప్పారు. తనపై తప్పుడు కేసులు పెడితే సంతోషమేనని ఆయన చెప్పారు. 

ముఖ్యమంత్రి తాను లక్ష్యంగా చేసుకొన్న వారిని పలు రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై రోజుకో కేసు పెట్టడాన్ని ఆయన ప్రశ్నించారు. ఏ ముఖ్యమంత్రి కూడ అధికారులను అన్నా అని పిలవరని  జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఏపీ రాష్ట్రంలో వైసీపీ  అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు, ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకొని కేసులు పెడుతున్నారని ఆ పార్టీ చీప్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు  పలుమార్లు చెప్పారు. ఈ విషయమై జాతీయ మానవహక్కుల సంఘానికి కూడ ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే.

click me!