తూ.గోదావరిలో కరోనా ఉధృతి: ఏపీలో మొత్తం కేసులు 19,70,0008 కి చేరిక

Published : Aug 02, 2021, 08:26 PM IST
తూ.గోదావరిలో కరోనా ఉధృతి: ఏపీలో మొత్తం కేసులు 19,70,0008 కి చేరిక

సారాంశం

  ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు కొన్ని జిల్లాల్లో తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది. ఇవాళ 1546 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో 59,641 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1546  మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,70,0008 కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 15 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,410కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1968 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 36వేల 016  మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 20,582 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,47,08,4540 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.గత 24 గంటల్లో అనంతపురంలో019,చిత్తూరులో 229, తూర్పుగోదావరిలో416, గుంటూరులో090,కడపలో 115, కృష్ణాలో158, కర్నూల్ లో043, నెల్లూరులో151, ప్రకాశంలో 201,విశాఖపట్టణంలో 054, శ్రీకాకుళంలో022, విజయనగరంలో 007, పశ్చిమగోదావరిలో 042కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో కరోనాతో  10 మంది చనిపోయారు. చిత్తూరులో ఆరుగురు,కృష్ణా,ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారు.తూర్పు గోదావరిలో ఇద్దరు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,410కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,56,349, మరణాలు 1078
చిత్తూరు-2,31,604 మరణాలు1743
తూర్పుగోదావరి-2,78,204, మరణాలు 1217
గుంటూరు -1,68,390,మరణాలు 1146
కడప -1,10,579, మరణాలు 622
కృష్ణా -1,09,305,మరణాలు 1217
కర్నూల్ - 1,23,282,మరణాలు 843
నెల్లూరు -1,34,627,మరణాలు 961
ప్రకాశం -1,30,019, మరణాలు 1007
శ్రీకాకుళం-1,20,681, మరణాలు 765
విశాఖపట్టణం -1,52,666 మరణాలు 1081
విజయనగరం -81,483, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,69,924, మరణాలు 1061

 

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్