చంద్రబాబుపై చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు

First Published Dec 12, 2017, 11:40 AM IST
Highlights
  • తిరుపతి మాజీ ఎంపి చింతా మోహన్ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి మాజీ ఎంపి చింతా మోహన్ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడును ‘బడుద్దాయి ముఖ్యమంత్రి’ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనికిరాడని, కాబట్టి వెంటనే భేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వాటాల పంపిణీలో వచ్చిన తేడాల వల్లే రాద్దాంతం జరుగుతోందని మోహన్ ఆరోపించారు. చంద్రబాబుకు ఇక ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని తేల్చేశారు కూడా.

పనిలో పనిగా వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిపైన కూడా ఆరోపణలు చేశారు. అధికారం అందుకోవటం కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నట్లు మాజీ ఎంపి అభిప్రాయపడ్డారు. మొత్తం జనాభాలో రెండు శాతం మాత్రమే ఉన్న జగన్ సామాజికవర్గానికి అధికారం ఎందుకంటూ నిలదీశారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కోర్టు సమీక్షలో నిలవదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

40 సంవత్సరాలు రాజ్యాధికారాన్ని అనుభవించిన సామాజకవర్గమే మరో 40 ఏళ్ళ అధాకారం కోసం పాదయాత్ర చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. ఇక, మరో సామాజికవర్గం 20 ఏళ్ళుగా పాలిస్తున్నారు కాబట్టే చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాధికారం సమాజంలో అత్యధికంగా ఉన్న కులాలకు దక్కాలని డిమాండ్ చేశారు. చివరగా గుజరాత్ ఎన్నికల గురించి మాట్లాడుతూ, 100 నుండి120స్దానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

click me!