టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రహమాన్ గురువారం నాడు రాజీనామా చేశారు.
విశాఖపట్టణం: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రహమాన్ గురువారం నాడు రాజీనామా చేశారు. ఎన్ఆర్‌సీ, రాజధాని అంశంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ రహమాన్ టీడీపీకి రాజీనామా చేశారు.
ఈ నెల 24వ తేదీ సాయంత్రం విశాఖపట్టణంలోని ఓ హోటల్ లో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను టీడీపీ నేతలు స్వాగతించారు.
ఈ సమావేశంలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సమర్ధిస్తూ తీర్మానం చేశారు.ఈ తీర్మానాన్ని చంద్రబాబుకు పంపారు.ఈ తీర్మానం పంపిన రెండు రోజులకే రహమాన్ టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చంద్రబాబునాయుడుకు పంపారు.
మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని చంద్రబాబునాయడు కోరుతున్నారు.మూడు రాజధానుల అంశంపై ఎవరూ కూడ మాట్లాడకూడదని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.
ఏపీకి మూడు రాజధానులు: జై కొట్టిన విశాఖ తమ్ముళ్లు, బాబుకు తీర్మానం
విశాఖ ను ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్ తీషుకున్న నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం విశాఖ నేతలు బలయ్యారని రహమాన్ విమర్శించారు. రాజధాని రైతుల ఆక్రందన కు చంద్రబాబు తీసుకొన్న నిర్ణయాలే కారణమన్నారు. సీఎం జగన్ కూడా రైతుల పరిస్థితి పై ఆలోచించాలన్నారు. త్వరలోనే రహమాన్ వైసీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఆయన ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.