టీడీపీ సీనియర్ నేత హఠాన్మరణం.. చంద్రబాబు దిగ్భ్రాంతి, చిరు ప్రజారాజ్యంలో..

By tirumala ANFirst Published Dec 26, 2019, 7:58 AM IST
Highlights

తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి(55) గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపిలో ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. గురువారం తెల్లవారు జామున 2 గంటలకు బుజ్జికి గుండెపోటు వచ్చింది.

తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి(55) గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపిలో ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. గురువారం తెల్లవారు జామున 2 గంటలకు బుజ్జికి గుండెపోటు వచ్చింది. దీనితో కుటుంబ సభ్యులు ఆయన్ని ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

అయినా ఫలితం లేకపోయింది. బడేటి బుజ్జి అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. బుజ్జి హఠాన్మరణంతో కుటుంబ సభ్యులలో విషాదం అలుముకుంది. 2014లో ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బుజ్జి శాసన సభ్యుడిగా గెలుపొందారు. 2014 నుంచి 2019 వరకు ఆయన ఏలూరు ఎమ్మెల్యే గా పనిచేసారు. 

ఏలూరులో మున్సిపల్ చైర్మన్ గా, కొన్సిలర్ గా పనిచేసిన అనుభవం కూడా బుజ్జికి ఉంది. ఏలూరులో టిడిపి బలపడడంతో బుజ్జి పాత్ర ఎంతోఉందని అక్కడి స్థానిక టిడిపి నేతలు, నాయకులు అంటున్నారు. 

రాజకీయంగా బుజ్జి అందరికి సుపరిచితుడైనప్పటికీ.. ఆయనకు సినీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా ఉంది. బుజ్జి మరెవరో కాదు దిగ్గజ నటుడు యస్వీ రంగారావుకు స్వయానా మేనల్లుడు. 

బుజ్జి అంతకు ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. 2009లో ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం తిరిగి టిడిపిలో చేరారు. బుజ్జి మరణవార్త తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. బుజ్జి మరణ వార్త తెలియగానే చంద్రబాబు దిగ్బ్రాంతికి గురయ్యారు. అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించినట్లు తెలుస్తోంది.  

click me!