సరుబుజ్జిలి ఈఓపీఆర్‌డీని దూషించిన కేసు: టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్

By narsimha lodeFirst Published Mar 2, 2020, 2:28 PM IST
Highlights

ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు

ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సరుబుజ్జిలి ఇన్‌ చార్జి ఈఓపీఆర్‌డీ గూనపు వెంకట అప్పలనాయుడికి ఫోన్‌ చేసి బూతులు తిట్టిన కేసులో నమోదైన కేసులో  పోలీసులు ఆఆయనను అరెస్ట్ చేశారు.  నాలుగు సెక్షన్ల కింద కూన రవి కింద కేసులు నమోదయ్యాయి.

 ఆముదాలవల మాజీ ఎమ్మెల్యే  కూన రవికుమార్ సరుబుజ్జిలి ఇన్‌ చార్జి ఈఓపీఆర్‌డీ గూనపు వెంకట అప్పలనాయుడికి ఫోన్‌ చేసి బూతులు తిట్టాడు. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

ఇంచార్జీ ఈఓపీఆర్‌డీ గూనపు వెంకట అప్పలనాయుడికి ఫోన్‌ చేసి బూతులు తిట్టిన విషయమై పోలీసులు కూన రవికుమార్‌ కు సోమవారం నాడు నోటీసులు ఇచ్చారు. దీంతో పార్టీ కార్యకర్తలతో కూన రవికుమార్‌పై పోలీస్ స్టేషన్ కు రవికుమార్ వచ్చాడు. స్టేషన్ ముందు బైఠాయించాడు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

అధికారుల వెంట ప్రజా ప్రతినిధులు  రారని రవికుమార్ చెప్పారు. నియోజకవర్గంలో అధికారుల జాబితా తన వద్ద ఉందని రవికుమార్ చెప్పారు. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే అధికారులను నిలదీస్తానని ఆయన స్పష్టం చేశారు. నాలుగు సెక్షన్ల కింద రవికుమార్‌పై కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. 

రావి వలస పంచాయితీలో డబ్బుల విషయమై  ఆయన సరుబుజ్జిలి ఇన్‌ చార్జి ఈఓపీఆర్‌డీకి ఫోన్‌ చేసి బూతులు తిట్టాడు. గతంలో కూడ సరుబుజ్జిలి ఎంపీడీఓను కూడ దూషించిన కేసులో రవికుమార్‌పై కేసు నమోదైంది,. ఈ కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నాడు. 

Also read:భూమిలో పాతరేస్తా: ఉద్యోగిపై మరోసారి టీడీపీ నేత తిట్ల దండకం

గతంలో కూడ పలువురు అధికారులతో ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే రవికుమార్ దూషణకు దిగినట్టుగా ఆరోపణలు  ఉన్నాయి. గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ ఎ.దామోదరరావు, అప్పటి ఈఓపీఆర్‌డీ పీవీ మురళిమోహన్‌పై దూషణలకు దిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. .

‘ఆఫీసులోనే తులుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్వు ఎవరూ ఆపలేరు. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా’ అంటూ సరుబుజ్జిలి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని మాజీ విప్‌ కూన రవికుమార్‌ బెదిరించినట్టుగా ప్రచారంలో ఉంది. తాజాగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయమై కూన రవికుమార్ పై బాధితుడు ఫిర్యాదు చేశాడు. 

ఫోన్‌ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని  ఈఓపీఆర్‌డీగా అప్పలనాయుడిని బండబూతులు తిట్టారు.  భూమిలో పాతేస్తానంటూ అప్పలనాయుడిని బెదిరించాడు. మళ్లీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే  ఇంటికి వచ్చి ఎత్తుకెళ్తానని బెదిరించాడు. 

click me!