:మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి తనయుడు యర్రా నవీన్ టీడీపీకి రాజీనామా చేశారు. తాను జనసేనలో చేరనున్నట్టు నవీన్ ప్రకటించారు.టీడీపీకి నవీన్ మంగళవారం నాడు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు
ఏలూరు:మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి తనయుడు యర్రా నవీన్ టీడీపీకి రాజీనామా చేశారు. తాను జనసేనలో చేరనున్నట్టు నవీన్ ప్రకటించారు.టీడీపీకి నవీన్ మంగళవారం నాడు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలను టీడీపీ నెరవేర్చలేకపోయిందని నవీన్ ప్రకటించారు.
సుదీర్ఘకాలం పాటు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి తనయుడు నవీన్ టీడీపీకి గుడ్‌బై చెప్పడం రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. నవీన్ ప్రస్తుతం కాపు కార్పోరేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
undefined
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హమీని టీడీపీ నెరవేర్చలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను కూడ టీడీపీ అమలు చేయలేదన్నారు.
కాపులకు కార్పోరేషన్ ఏర్పాటు చేయడంలో ఆలస్యం కారణంగా కాపు సామాజిక వర్గానికి పూర్తిగా సహాయం చేయలేకపోయినట్టు నవీన్ అభిప్రాయపడ్డారు. కాపు కార్పోరేషన్ ద్వారా కేవలం3208 మందికి మాత్రమే రుణాలు ఇచ్చినట్టు ఆయన చెప్పారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనను పార్టీలోకి చేరాలని ఆహ్వానించినటటు నవీన్ తెలిపారు. తాడేపల్లిగూడెం కేంద్రంగా తాను జనసేన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు నవీన్ ప్రకటించారు.