పశువుల్లంక పడవ ప్రమాదం ఆ కూలీలను బలిచేసేది, కానీ ఈ పోస్ట్ మాస్టర్...

First Published Jul 18, 2018, 2:35 PM IST
Highlights

తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పడవ ప్రమాదం అమాయక చిన్నారులను బలితీసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇదే ప్రమాదం కొందరు కూలీలను కూడా తీవ్రంగా నష్టపరిచేది. కానీ ప్రాణాలకు తెగించి ఓ పోస్టు మాస్టర్ ఆ కూలీల డబ్బులను నీటిలో కొట్టుకుపోకుండా కాపాడి సాహసం చేశాడు.
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని శేరు లంక లో పోస్టు మాస్టర్ గా పనిచేస్తున్న కొండెపూడి ఆనందరావు ఉపాధి కూలీల డబ్బు రూ.3 లక్షలు తీసుకుని పశువుల్లంక కు గత శనివారం బయలుదేరాడు. అయితే ఇతడు కూడా ప్రమాదానికి గురైన పడవలోనే నగదు బ్యాగును తీసుకుని ఎక్కాడు. ఆ తర్వాత పడవ ప్రమాదానికి గురై గోదావరిలో మునిగిన విషయం అందరికీ తెలిసిందే.

పడవ ప్రమాదంలో పోస్టు మాస్టర్ కూడా నదిలో పడిపోయాడు. అయితే ఇతడితో పాటు నగదు బ్యాగు కూడా నీటిలో పడింది. నీటి ఉదృతి ఎక్కువగా ఉండి నగదు బ్యాగు కొట్టుకుపోతుండటాన్ని గమనించిన ఆయన తన ప్రాణాలకు తెగించి బ్యాగు ను పట్టుకున్నాడు. దాన్ని పట్టుకుని ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చి తన ప్రాణాలతో పాటు కూలీల డబ్బులను కాపాడాడు.

అయితే నీటిలో నానిన కరెన్సీ కట్టలను ఆరబెట్టి ఇటీవలే కూలీలకు అందజేశారు. అయితే తన ప్రాణాలకు తెగించి తమ డబ్బును తీసుకువచ్చిన పోస్ట్ మాస్టర్ సాహసానికి, నిజాయితీకి గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు.

click me!